newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బెంగాల్ ఫలితం నేడే ... ఫలం ఎవరికీ?

02-05-202102-05-2021 08:10:18 IST
Updated On 02-05-2021 09:59:05 ISTUpdated On 02-05-20212021-05-02T02:40:18.268Z02-05-2021 2021-05-02T02:40:15.076Z - 2021-05-02T04:29:05.155Z - 02-05-2021

బెంగాల్ ఫలితం నేడే ... ఫలం ఎవరికీ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎనిమిది దశల పాటు హోరాహోరీగా సాగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల వ్యవధిలో వెలువడబోతున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎలా ఉన్నప్పటికీ వాస్తవ, అంతిమ ఫలితం అందబోయేది ఆదివారమే. పశ్చిమ బెంగాల్ తో పాటు మరో నాలుగు అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా పశ్చిమ బెంగాలే ప్రధాన రాజకీయ రణక్షేత్రమైంది. కారణం మూడవ సారి అధికారానికి దీదీ అహరహం శ్రమించడం, లోక్ సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాల ఆలంబనగా బెంగాల్ కోటలో పాగా బెయాలని బిజెపి భావించడమే ఈ నేపథ్యంలో ఆదివారం రానునన్ ఫలితం మమతా బెనర్జీ ఆధిపత్యానికి సంకేతం అవుతుందో లేక బిజెపి స్వైర విహారానికి అద్దడం పడుతుందా వేచి చూడాల్సిందే. ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు ఆస్కారం లేదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కౌంటింగ్ కు సంబంధించి అత్యంత కట్టుదిట్టమైన రీతిలో రాష్ట్రవ్యాప్తంగా 108 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఇప్పటికే ఈవీఎంల, వివిప్యాట్లను ఆయా కేంద్రాలకు తరలించారు. కోవిడ్  భద్రతా నిబంధనల అమలుకు కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం 292 మంది పరిశీలకులతో పాటు 256 కంపెనీల కేంద్ర దళాలను 23 జిల్లాలలోనూ మోహరించారు. కోవిడ్ కేసులు తీవ్రమవుతున్నందున భద్రత విషయంలో ఎక్కడా రాజీపడకుండా అన్ని చోట్లా మాస్కులను, శానిటైజర్లను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చారు. ప్రతి కేంద్రంలోనూ 15 సార్లు శానిటైజేషన్ నిర్వహిస్తామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. చివరిదశ పోలింగ్ భారీగా జరిగినందున అధికార టిఎంసికే విజయావకాశాలు మెరుగయ్యాయంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడిన విషయం తెలిసిందే.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

అయితే వామపక్షాలు,  కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ కూటమి పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, బిజెపి మధ్యే హోరాహోరీగా పోరు సాగే అవకాశం ఉంది. మొత్తం 294 సీట్లలో 147 స్థానాలు దక్కించుకున్న పార్టీయే రానున్న ఐదేళ్లు బెంగాల్ లో రాజ్యమేలుతుంది. మొత్తం కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎవరూ కౌంటింగ్ కేంద్రాలను వదిలి వెళ్ళడానికి వీలు లేదని ఇటు అభ్యర్థులను, అటు ఏజెంట్లను తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. అలాగే కోవిడ్  నిబంధనలు పాటించాలని ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు టీ, స్నాక్స్ ఏదిచ్చినా తీసుకోరాదని అన్నారు. పశ్చిమ బెంగాల్ తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి.   

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   19 minutes ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   2 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   8 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   8 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   6 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   9 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   5 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   10 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle