ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-202212-05-2022 10:20:17 IST
2022-05-12T04:50:17.632Z12-05-2022 2022-05-12T04:50:14.934Z - - 27-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్నాడన్న కారణంతో ఆ రాష్ట్ర డీజీపీ ముకుల్ గోయల్‌ను అర్ధాంతరంగా తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనులను పట్టించుకోకపోవడం, శాఖాపరమైన పనులపై ఆసక్తి చూపడం లేదంటూ డీజీపీ పదవి నుంచి ఆయన్ని తప్పిస్తున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. కాగా గత ఏడాది జూన్‌లోనే యూపీ డీజీపీగా ముకుల్ గోయల్ బాధ్యతలు చేపట్టారు . ప్రస్తుతం డీజీపీ పోస్ట్ నుంచి ముకుల్ గోయల్‌ను సివిల్ డిఫెన్స్ డీజీ పోస్టుకు పంపించారు. ఇంటెలిజెన్స్ డీజీ డీఎస్ చౌహాన్ యూపీకి తర్వాతి డీజీపీ అయ్యే అవకాశం ఉంది. 1987 ఉత్తర ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ముకుల్ గోయల్.. గతంలో పలు కీలక పదవులు చేపట్టారు. గతంలో బీఎస్ఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్‌గానూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. పోలీసు రిక్రూట్మెంట్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2007లో మాయావతి సర్కార్ ముకుల్‌పై సస్పెన్షన్ వేటు కూడా వేయడం విశేషం.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022

సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసిపీలో చేరిన టీడీపీ, జనసేన నేతలు
11-05-2022
ఇంకా