newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

దీదీ చుట్టూ ప్రదక్షిణాలు..

02-06-202102-06-2021 14:01:32 IST
2021-06-02T08:31:32.990Z02-06-2021 2021-06-02T08:31:26.146Z - - 22-06-2021

దీదీ చుట్టూ ప్రదక్షిణాలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజకీయాలలో పార్టీలు మారడం సహజమైన విషయం. ఎన్నికల సమయంలో నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుతో పాటు స్వప్రయోజనాలు ఏ పార్టీలో అయితే బావుం టాయో బేరీజు వేసుకుని కండువాలు మార్చుకుంటారు. ఇక ఒక పార్టీ అధికారంలోకి రాగానే తమ పార్టీ వీడి అధికార పార్టీ లోకి జంప్ అవుతుంటారు. అదేమని అడిగితే తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇష్టం లేకపోయినా పార్టీ మార్చాల్సి వస్తుందని మొసలి కన్నీరు కారుస్తుంటారు. ఇది ప్రస్తుతం రాజకీయాలలో సహజాతి సహజం అయిపోయాయి. ఇక విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసీ) పార్టీ లోనుండి చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బిజేపీ లోకి జంప్ అయ్యారు. వారి లెక్కల ప్రకారం బిజేపీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పశ్చిమ బెంగాల్ లో స్పష్టమైన మెజారిటీతో బిజేపీ విజయ దుందుభి మ్రోగిస్తుందని అంచనా వేశారు. ఇందులో వారి పొరపాటు ఏమీ లేదు. ఎందుకంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలని చాలెంజ్ గా తీసుకున్నాడు. తనకి కొరకరాని కొయ్యగా మారిన మమతా బెనర్జీ సర్కారుని కూలదోసి కాషాయ జెండా ఎగుర వేయడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నే రంగంలోకి దించారు.

ఈ పరిణామాలని బట్టి తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసీ) పార్టీ వీడి చాలా మంది బిజేపీ లోకి క్యూ కట్టారు. తీరా ఫలితాలు తారుమారు అయ్యి మమతా బెనర్జీ కి పశ్చిమ బెంగాల్ ప్రజలు పట్టం కట్టడంతో పార్టీ ఫిరాయించిన వాళ్ళలో అంతర్మధనం మొదలయ్యింది. బిజేపీ అధికారం లోకి వస్తే మంత్రులై పోవచ్చనుకున్నవారి కలలు అడియాశలయ్యాయి. దీంతో ఇప్పుడు వీళ్ళంతా దీదీ శరణు కోరుతున్నారు. వరుసగా దీదీ కి లేఖలు వ్రాస్తూ ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. వీరిలో దీపేందు విశ్వాస్, సోనాలి గుహ లాంటి నాయకులు ఉన్నారు. పార్టీని వీడి పెద్ద పొరపాటు చేశామని పశ్చాత్తాప పడుతున్నారు. మరి వీరి అభ్యర్థనని మన్నించి దీదీ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తుందా.. లేదా అన్నది చూడాలి..

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

   2 hours ago


ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

   5 hours ago


పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

   9 hours ago


సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

   12 hours ago


టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

   13 hours ago


బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు  శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

   a day ago


తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

   21-06-2021


ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

   21-06-2021


పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

   21-06-2021


హరీష్ రావు పై ప్రశంశల వర్షం

హరీష్ రావు పై ప్రశంశల వర్షం

   21-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle