newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోవిడ్ చికిత్సకు మరింత సిబ్బంది... నీట్ పి.జి. వాయిదా: కేంద్రం కీలక నిర్ణయం

04-05-202104-05-2021 09:00:50 IST
2021-05-04T03:30:50.910Z04-05-2021 2021-05-04T03:30:40.187Z - - 14-05-2021

కోవిడ్ చికిత్సకు మరింత సిబ్బంది... నీట్ పి.జి. వాయిదా: కేంద్రం కీలక నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్  వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు నిపుణులను, వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు మోడీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వీటితో పాటు అర్హులైన వైద్యులకు కోవిడ్ బాధ్యతలను అప్పగించడానికి వీలుగా నీట్ పి.జి  పరీక్షలను నాలుగు నెలలపాటు వాయిదా వేసింది.  రోగుల సంఖ్య ఏరోజుకు ఆరోజు లక్షల్లో పెరుగుతున్నందున మెడికల్ ఇంటర్నీలను కూడా పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపాలని ప్రభుత్వం నిర్ణయించింది.  తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. వంద రోజుల పాటు కోవిడ్ విధులను నిర్వహించిన వైద్య వృత్తిలో ఉన్నవారికి అనంతరం ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇస్తామని, అలాగే వీరికి విశిష్ట కోవిడ్ జాతీయ సర్వీస్ సమ్మాన్ పురస్కారాన్ని కూడా అందిస్తామని పిఎంఓ తెలిపింది. ఎంబిబిఎస్ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థుల సేవలను కూడా కోవిడ్ విధులలో వినియోగించుకోనున్నారు. స్వల్ప కోవిడ్  కేసుల విషయంలో పర్యవేక్షణ, సంప్రదింపుల బాధ్యతను నిపుణుల పర్యవేక్షణలో వీరికి అప్పగిస్తారు.

మెడికల్ ఇంటర్నీలు కూడా వారి ఫ్యాకల్టీల పర్యవేక్షణలోనే పని చేస్తారు. కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా పెద్ద సంఖ్యలో మానవ వనరులను అందుబాటులోకి తేవడం వల్ల ప్రస్తుత వైద్యులపై భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మూడంచెలుగా ప్రజలకు సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని పిఎంఓ తెలిపింది. సీనియర్ వైద్యులు, నర్సుల పర్యవేక్షణలో బి ఎస్సీ లేదా జిఎన్ఎం అర్హత కలిగిన నర్సులను పూర్తి స్థాయిలో కోవిడ్  రోగులకు సహాయపడేందుకు వినియోగిస్తారు. అలాగే వంద రోజుల పాటు కనీస కోవిడ్ విధులను నిర్వహించిన వీరికి రాబోయే ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని పిఎంఓ వెల్లడించింది. కోవిడ్  విధులకు హాజరయ్యే వైద్య విద్యార్థులు నిపుణులకు అన్ని రకాలుగా వైద్య పరమైన భద్రత కల్పిస్తామని తెలిపింది. కోవిడ్ విధుల్లో కనీసం వంద రోజులు పూర్తి చేసిన వారికి ప్రధాన మంత్రి జాతీయ సేవా సమ్మాన్ ను కూడా అందిస్తామని పి ఎంఓ తెలిపింది. కోవిడ్ వ్యాధిగ్రస్తులకు చికిత్సచేసేందుకు, సర్వీసును అందించేందుకు దేశవ్యాప్తంగా నిపుణుల చాలా తీవ్రంగానే ఉంది. ప్రోత్సాహకాలు ఇచ్చి మానవ వనరులను పెంచాలని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటికే విజ్ఞప్తి చేశామని పి  ఎం ఓ వెల్లడించింది.  కేసులు తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో వైద్య సిబ్బంది కొరత తీర్చాలని తెలిపింది.  

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   2 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   5 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   10 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   10 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   8 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   11 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   7 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   12 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle