newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

5న మమత ప్రమాణం

03-05-202103-05-2021 20:01:47 IST
2021-05-03T14:31:47.022Z03-05-2021 2021-05-03T14:31:41.854Z - - 14-05-2021

5న మమత  ప్రమాణం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ ముచ్చటగా మూడవసారి రాష్ట్ర పగ్గాలను చేపట్టేందుకు సన్నద్ధమవు తోంది. అత్యంత హోరాహోరీగా సాగిన నందిగ్రామ్ నియోజకవర్గ ఎన్నికలో బిజెపి నాయకుడు, సువెందు అధికారి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బెంగాల్ పీఠాన్ని 5వ తేదీన అధిష్టించబోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకుడు పార్థా ఛటర్జీ వెల్లడించారు.    ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ ను కలుసుకొని తమ పార్టీ విజేతల జాబితాను మమతా బెనర్జీ అందించనున్నారు.  మొదట మమతా బెనర్జీయే విజయం సాధిచినట్లుగా కథనాలు వచ్చినప్పటికీ అంతిమంగా 1956 ఓట్ల తేడాతో అధికారి విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నందిగ్రామ్ ఓట్లను మళ్ళి లెక్కించాలంటూ టి ఎం సి చేసిన డిమాండ్ ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఈ ఫలితంపై సుప్రీం కోర్టుకు వెళ్తామని మమత ప్రకాయించారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలలో 213 సీట్లను తృణమూల్ కాంగ్రెస్, 77 స్థానాలను బిజెపి గెలుచుకు న్నాయి.

రెండు సీట్లకు సంబంధించి తరువాత పోలింగ్ నిర్వహిస్తారు. అనూహ్య రీతిలో నెల రోజులకు పైగా వ్యవధిలో ఎనిమిది దశల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 34 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని తిరుగులేని అధికారంతో పాలించిన వామపక్ష కూటమిని కుప్పకూల్చి 2011లో తొలిసారిగా మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. రెండవసారి కూడా అంతే ఘానా విజయాన్ని ఆమె సాధించా రు. ముచ్చటగా మూడవసారి కూడా అధినేత్రి ఓడినా పార్టీకి పట్టం కట్టారు. ప్రతి ఎన్నికలోనూ పార్టీ బలం పెరుగుతూ రావడం గమనార్హం.   పాత్రికేయులను కోవిడ్ యోధులుగా అభివర్ణించిన మమత ఎన్నికల ప్రచార సమయంలో వారు నిర్వహించిన పాత్రను ప్రశంసించారు. మరోపక్క మూడవసారి కూడా విజయం సాధించిన మమతకు అభినందనలు, ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తానింకా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదని మమత స్పష్టం చేశారు. అదే సమయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ కూడా పాత్రికేయుల విధి నిర్వహణను ప్రశంసించడమే కాకుండా వారిని కోవిడ్ యోధులుగా వర్ణించారు. రాష్ట్రంలో పాత్రికేయుల  భద్రతకు సంబంధించి అన్ని విధాలుగా చర్యలు చేపడుతామని తెలిపారు. మమతా బెనర్జీ నందిగ్రామ్ లో ఓడిపోవడాని బిజెపి తమ నైతిక విజయంగా ప్రకటించుకున్నప్పటికీ దీదీ పరాజయం ఇటు ఆమెకు, అటు పార్టీకి కూడా మంచిదేనన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.  

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   42 minutes ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   3 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   8 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   9 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   7 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   9 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   6 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   10 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle