newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్..!

01-05-202101-05-2021 11:30:15 IST
Updated On 01-05-2021 11:41:59 ISTUpdated On 01-05-20212021-05-01T06:00:15.129Z01-05-2021 2021-05-01T05:21:01.541Z - 2021-05-01T06:11:59.522Z - 01-05-2021

కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్ణాటక రాష్ట్రంలో ఏప్రిల్ 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 8 జిల్లాల్లోని 10 స్థానిక సంస్థల్లో 263 వార్డులకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 120 స్థానాల్లో విజయాన్ని అందుకుంది. బీజేపీ కంటే జేడీఎస్ ఎక్కువ స్థానాల్లో గెలవడం విశేషం. బీజేపీ 57 స్థానాలకే పరిమితం కాగా, జేడీఎస్ 66 స్థానాల్లో విజయం సాధించింది. బళ్లారి కార్పొరేషన్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ 39 వార్డుల్లో 20 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ 14 చోట్ల, ఇతరులు ఐదు చోట్ల గెలుపొందారు. బీదర్‌లో హంగ్ ఏర్పడింది. అయితే, 15 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 8, జేడీఎస్ 7, ఎంఐఎం 2, ఆప్ ఒక స్థానంలో విజయం సాధించింది. బెంగళూరు రూరల్ జిల్లా విజయపురలో 23 వార్డులకు గాను జేడీఎస్ 14, కాంగ్రెస్ 6, ఇతరులు 2 చోట్ల విజయం సాధించగా, బీజేపీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. మడికెరె నగరసభను మాత్రం బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ 23 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ 16, ఎస్‌డీపీఐ 5, కాంగ్రెస్, జేడీఎస్‌లు ఒక్కో స్థానంలో విజయం సాధించాయి.

రామనగరలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇక్కడ 31 స్థానాలకు గాను కాంగ్రెస్ 19, జేడీఎస్ 11, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. బీజేపీ ఇక్కడ ఖాతా కూడా తెరవలేదు. రామనగర జిల్లా చెన్నపట్టణ నగర సభ ఎన్నికల్లో 31 వార్డులకు గాను జేడీఎస్ 16 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ ఏడు, బీజేపీ ఏడు స్థానాల్లో గెలుపొందాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందాడు. హసన్ జిల్లాలోని బేలూరు లో మొత్తం 23 స్థానాలుండగా కాంగ్రెస్ 17, జేడీఎస్ 5 స్థానాలను కైవసం చేసుకున్నాయి. బీజేపీకి ఒక్క స్థానం దక్కింది. ముఖ్యమంత్రి యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో మొత్తం 35 స్థానాలుండగా కాంగ్రెస్ 18, జేడీఎస్ 11, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందాయి. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలో 15 వార్డులకు కాంగ్రెస్ 9, బీజేపీ 6 స్థానాల్లో విజయం సాధించగా, చిక్కబళ్లాపుర జిల్లా గుడిబండ పట్టణ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. 11 స్థానాలకు గాను కాంగ్రెస్ 6, జేడీఎస్ 2, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు.

కరోనాతో మరణించిన ఓ అభ్యర్థిని విజయం వరించింది. రామనగర నగరసభ ఎన్నికల్లో కోవిడ్‌తో మృతి చెందిన అభ్యర్థి 'లీల' భారీ మెజారిటీతో విజయం అందుకుంది. 4వ వార్డు నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆమో పోటీ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఆమె గత గురువారం కోవిడ్‌తో మృతి చెందారు. 

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   2 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   4 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   10 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   10 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   8 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   11 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   7 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   11 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle