వీకెండ్ లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం
22-01-202222-01-2022 10:02:14 IST
2022-01-22T04:32:14.075Z22-01-2022 2022-01-22T04:32:10.884Z - - 27-05-2022

కరోనా కట్టడిలో భాగంగా విధించిన వీకెండ్ లాక్‌డౌన్‌ను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నెలారంభం నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉండడంతో వీకెండ్ లాక్ డౌన్ ను ఎత్తివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనికితోడు వారాంతపు నిర్బంధంతో ఇబ్బందులు పడుతున్నట్లు సామాన్యుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో నిపుణుల సూచన మేరకు వీకెండ్ లాక్డౌన్ వెనక్కి తీసుకున్నట్లు మంత్రి ఆర్.అశోక్ వెల్లడించారు. బెంగళూరు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కొనసాగుతాయన్నారు. రాత్రి కర్ఫ్యూ యథావిధిగా ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, జాతరలకు అనుమతి లేదన్నారు. పబ్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లలో 50 శాతం సీట్ల సామర్థ్యానికే అనుమతించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు తదితర ప్రాంతాల్లో జనాలు గుంపులు గుంపులుగా ఉండరాదన్నారు. కాగా బెంగళూరులో మరి కొన్ని రోజుల పాటు పాఠశాలలు మూతపడే ఉంటాయని, వచ్చే వారం నిపుణులతో మరోసారి సమావేశమై పాఠశాలల పునఃప్రారంభంపై తుది నిర్ణయం ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ తెలిపారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా