newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

నటి చాందిని కేసు.. అజ్ఞాతంలోకి మాజీ మంత్రి..

01-06-202101-06-2021 11:20:21 IST
2021-06-01T05:50:21.476Z01-06-2021 2021-06-01T05:46:45.934Z - - 22-06-2021

నటి చాందిని కేసు.. అజ్ఞాతంలోకి మాజీ మంత్రి..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నటి చాందిని వ్యవహారంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే మాజీ మంత్రి మణికంఠన్‌ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు నాగపట్టినం, రామానాథపురం జిల్లాల్లో గాలిస్తున్నట్లు తెలుస్తోంది. పలు తమిళ చిత్రాల్లో నటించిన చాందినీ ఇటీవల చెన్నై వెప్పేరీ పోలీస్‌స్టేషన్‌లో మణికంఠన్‌పై ఇటీవల ఫిర్యాదు చేశారు. 

వివరాలలోకి వెళితే.. మలేషియా పర్యాటకాభివృద్ధి రాయబార కార్యాలయంలో పనిచేస్తున్నపుడు విధి నిర్వహణలో భాగంగా తరచూ భారత్‌కు రాకపోకలు సాగించేదానిని. పర్యాటకాభివృద్ధి సంబంధించి మాట్లాడాల్సి ఉందని అప్పట్లో రామనాథపురం అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా ఉండిన మణికంఠన్‌.. భరణి అనే వ్యక్తిద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో 2017 మే 3వ తేదీన మంత్రి హోదాలో మణికంఠన్‌ను ఆయన ఇంటి వద్ద కలిశాను. అదే సమయంలో నా సెల్‌ఫోన్‌ నెంబరు తీసుకున్న మణికంఠన్‌ పెళ్లిపేరుతో నమ్మబలికాడు.  

తన భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత నిన్ను అందరి ముందు రెండో పెళ్లి చేసుకుంటానని, ఇప్పుడే పెళ్లి చేసుకుంటే రాజకీయంగా కొన్ని ఇబ్బందులు వస్తాయని మణికందన్ ఇంతకాలం తనకు మాయమాటలు చెప్పాడని చాందిని ఆరోపిస్తున్నది. ఇలా మాయమాటలు చెప్పిన మణికందన్ తనకు ఇప్పటి వరకు మూడు సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని నటి చాందిని ఆరోపిస్తున్నది.

నన్ను పెళ్లి చేసుకోనని చెప్పిన మణికందన్ కు తాను ఎదురు తిరిగానని తనను చంపేస్తానని ఆయన కిరాయి రౌడీలతో బెదరిస్తున్నాడని నటి చాందిని ఆరోపిస్తోంది. నువ్వు పోలీసు కేసు పెడితే ఇంతకాలం రహస్యంగా బెడ్ రూమ్ లో, బాత్ రూమ్ లో తీసుకున్న నీ అశ్లీల వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని మణికందన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, అతను అన్నంత పని చేస్తాడని, తనకు భయంగా ఉందని ఆరోపిస్తూ నటి చాందిని మూడు రోజుల క్రితం చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. 

నటి చాందిని వెనుక మనీల్యాండింగ్ ముఠా ఉందని, కొన్ని రోజు క్రితం మూడు కోట్ల రూపాయలు ఇవ్వకుంటే మీ మీద కేసులు పెడుతామని కొందరు బ్లాక్ మెయిల్ చేశారని, డబ్బులు ఇవ్వలేదని ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మణికందన్ ఆరోపిస్తున్నారు. చాందిని వెనుక తన రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారని, తన రాజకీయ జీవితం అంతం చెయ్యడానికి కుట్ర జరుగుతోందని, చట్టపరంగా, న్యాయస్థానంలో తాను చాందినిని ఎదుర్కొంటానని మాజీ మంత్రి మణికందన్ అంటున్నాడు. మరి ఈ కేసు చివరికి ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. 

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

   28 minutes ago


ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

   4 hours ago


పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

   8 hours ago


సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

   11 hours ago


టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

   12 hours ago


బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు  శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

   a day ago


తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

   21-06-2021


ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

   21-06-2021


పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

   21-06-2021


హరీష్ రావు పై ప్రశంశల వర్షం

హరీష్ రావు పై ప్రశంశల వర్షం

   21-06-2021


ఇంకా

Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle