newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఢిల్లీ సీఎం సహాయం.. 2 నెలలు ఫ్రీ రేషన్, ఆటో డ్రైవర్లకు ఐదు వేలు

04-05-202104-05-2021 16:22:21 IST
2021-05-04T10:52:21.200Z04-05-2021 2021-05-04T10:49:26.631Z - - 14-05-2021

ఢిల్లీ సీఎం సహాయం.. 2 నెలలు ఫ్రీ రేషన్,  ఆటో డ్రైవర్లకు ఐదు వేలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ కోవిడ్ కష్టాల్లో కూరుకుపోయింది. ఎక్కడా ఏ రకమైన ఉపశమనం లేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆక్సిజన్ కొరత, వైరస్ వ్యాప్తి భయానకం కావడంతో లాక్ డౌన్ ను పొడిగించిన సర్కార్ ప్రజలను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చింది. రానున్న రెండు నెలల పాటు 72 లక్షల మందికి ఉచితంగానే రేషన్ అవసరాలు తీరుస్తామని, ఆవిధంగా కోవిడ్ నష్టం నుంచి కొంతయినా ఉపశమనం కలిగిస్తామని చెబుతోంది. కోవిడ్ 19 సంక్షోభం అన్ని వర్గాల ఆదాయాన్నీ హరించినందున ఆటో రిక్షా డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకూ కూడా రూ. 5000 ఆర్హిక సహాయాన్ని అందిస్తామని ప్రకటించింది.   

అయితే రెండు నెలల పాటు అమలయ్యేలా ఈ ఆర్ధిక సహాయాన్ని తాము ప్రకటిస్తున్నా ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ రెండు నెలల పాటు కొనసాగుతుందని భావించడానికి వీలు లేదని అన్నారు. ప్రభుత్వపరంగా తాను తీసుకుంటున్న చర్యల వల్ల ఢిల్లీలో పరిస్థితి మెరుగవుతుందని, అసలు లాక్ డౌనే అవసరం లేని పరిస్థితులు త్వరలోనే ఏర్పడగలదన్న ధీమా తమ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. మొదటి దశలో కూడా లక్షా 56 వేల మంది టాక్సీ, ఆటో డ్రైవర్లకు గత ఏడాది 5000 రూపాయల ఆర్హిక సహాయాన్ని అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ఇప్పుడు కూడా పరిస్థితి తీవ్రంగా ఉన్నందున వారికి ఈ సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ సహాయాన్ని ప్రకటించడానికి ముందు ఢిల్లీలో కోవిడ్  పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి సిసోడియాతో కలసి కేజ్రీవాల్ సమీక్షించారు. ఇంట్లోనే ఉంది చికిత్స చేసుకునే విధానాన్ని మెరుగుపరచాలని ఈ విధంగా చికిత్స పొందుతున్న వారికి తగిన సలహాలు ఇవ్వాలని సూచించారు. అసలు ఎంత మంది కోవిడ్  రోగులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు? ఎంత మంది ఇళ్లల్లోనే ఉంది మందులు వాడుతున్నారని దానిపై స్పష్టమైన లెక్కలు ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం ఢిల్లీలో కోవిడ్ పరిస్థితి వైద్య సదుపాయాలపై అఠ్యంత తీవ్రమైన ప్రభావాన్నే కనబరిచింది. ఇంట్లోనే ఉండి కోవిడ్ పరీక్ష చేసుకోవాలన్నా ఏ వ్యక్తయినా ఏడు రోజుల పాటు ఆగక తప్పని పరిస్థితులు ఢిల్లీలో ఉన్నాయి. కేసుల తీవ్రతతో పాటు లాక్ డౌన్ కూడా అమలులో ఉండటం వల్ల మరింతగా జనం ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వపరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కోవిడ్  వైరస్ వ్యాప్తి మాత్రం అదుపులోకి రావడం లేదు. 

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   an hour ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   3 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   9 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   9 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   7 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   10 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   6 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   10 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle