newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మరో వారం ఢిల్లీలో లాక్ డౌన్

01-05-202101-05-2021 20:31:24 IST
2021-05-01T15:01:24.594Z01-05-2021 2021-05-01T14:58:51.610Z - - 14-05-2021

మరో వారం ఢిల్లీలో లాక్ డౌన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: దేశ రాజధాని అయినప్పటికీ ఢిల్లీకి కోవిడ్ కష్టాలు తీరడం లేదు. కేసుల తీవ్రత ఆస్కిజన్  కొరత బెంబేలేత్తిస్తున్న మరణాలతో ఢిల్లీ అనునిత్యం తల్లడిల్లుతోంది. దాదాపు లక్ష వరకు కోవిడ్ కేసులు ఉన్న నేపథ్యంలో అన్ని విధాలుగా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితిని అధ్యయనం చేసిన అనంతరం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించడానికే మొగ్గు చూపారు. ప్రస్తుత లాక్ డౌన్ సోమవారంతో ముగుస్తుంది. దీనిని మరో వారం పాటు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. గత నెల రోజులుగా ఢిల్లీకి కోవిడ్ కేసుల నుంచి ఉపశమ నమే లేదు. దాంతో మొదట ఏప్రిల్ 19న 26 వరకు లాక్ డౌన్ విధించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మే 3వరకు దానిని పొడిగించారు. ఇంకా ఎలాంటి మార్పు రాని నేపథ్యంలో మూడవసారి కూడా కర్ఫ్యూ పొడిగింపు అనివార్యమైంది. అయితే ప్రజల నిత్యావసరాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని బ్యాంకు, ఏటిఎం లు, మీడియా, కేబుల్ ఆధారిత సర్వీసులు యథాతధంగా కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. అలాగే వైద్య, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సౌకర్యాలు కూడా కొనసాగుతాయని వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా మొదలైంది కాబట్టి అందుకోసం వెళ్లే వ్యక్తులు తగిన ఆధారాలు చూపించవల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.  

ఢిల్లీలో ఆక్సిజన్ కొరత మరోసారి ప్రాణాంతకంగా పరిణమించింది. బాత్రా ఆసుపత్రిలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఒక డాక్టర్ సహా 8 మంది మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ సంఘటన చాలా బాధాకరమని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఢిల్లీకి అందించాల్సిందేనని కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీలో అనేక ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత అత్యంత తీవ్రంగా ఉంది. ఈ సంఘటన పై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజల ప్రాణాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందని అన్నారు. ఢిల్లీకి 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమైతే కేవలం 312 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నే సరఫరా చేస్తున్నారని, ఇదెక్కడి అన్యాయమని ఆయన ప్రశ్నించారు. కాగా 18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం నుంచి లాంఛనంగా మొదలవుతుందని ఇందుకు ముందుగానే పేర్లు నమోదు చేసుకోవలసి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.  

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   an hour ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   3 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   9 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   9 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   7 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   10 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   6 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   10 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle