newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

ఆమెను మంత్రి వర్గం లోకి తీసుకోవాల్సిందేనంటూ రచ్చ మొదలైంది

20-05-202120-05-2021 14:43:42 IST
Updated On 20-05-2021 12:35:59 ISTUpdated On 20-05-20212021-05-20T09:13:42.484Z20-05-2021 2021-05-20T06:50:45.336Z - 2021-05-20T07:05:59.856Z - 20-05-2021

ఆమెను మంత్రి వర్గం లోకి తీసుకోవాల్సిందేనంటూ రచ్చ మొదలైంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌ తొలి దశలో అద్భుతంగా పనిచేసిన కేకే శైలజకు కేరళ  మంత్రివర్గంలో చోటు లభించలేదు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈసారి తన కేబినెట్‌లో దాదాపు అందరినీ కొత్తవారినే తీసుకున్నారు. దీంతో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. క‌రోనా వైర‌స్ దేశంలోకి ప్రవేశించిన మొద‌ట్లో కేకే శైల‌జ‌ అద్భుతంగా ప‌నిచేశారు. కేర‌ళలో వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌ను, అంటువ్యాధుల‌తో పాటు క‌రోనా కేసుల‌ను కట్టడి చేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా కేకే శైల‌జ‌కు మంచి పేరు దక్కింది.

అయితే రెండోసారి వ‌రుస‌గా కేర‌ళ‌లో అధికారంలోకి వ‌చ్చిన లెఫ్ట్ కూట‌మి ప్ర‌భుత్వంలో శైల‌జ‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. మే 20న కేరళలో కొలువుదీరనున్న కొత్త కేబినెట్‌లో శైలజకు చోటు ద‌క్క‌లేద‌ని స‌మాచారం. ఆమెకు మంత్రి ప‌ద‌వి కేటాయించ‌కుండా పార్టీ విప్‌గా నియ‌మించనున్నారు. 11మంది కొత్త వారికి మంత్రులుగా అవ‌కాశం క‌ల్పించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రకటించిన వివరాల ప్రకారం పినరయి విజయన్ తదుపరి మంత్రివర్గంలో ఎంవీ గోవిందన్, కే రాధాకృష్ణన్, కేఎన్ బాలగోపాల్, పీ రాజీవ్, వీఎన్ వాసవన్, సజి చెరియన్, వీ శివన్ కుట్టి, మహమ్మద్ రియాస్, డాక్టర్ ఆర్ బిందు, వీణా జార్జి, వీ అబ్దుల్ రహమాన్ మంత్రి పదవులను చేపట్టబోతున్నారు.

ప్రధాని మెచ్చుకున్న ఆమెను పక్కన పెట్టేసిన పినరయి

శైలజను మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో పలువురు సినీ తారలు కూడా ఆమెకు మద్దతు పలుకుతున్నారు. #BringBackShailajaTeacher, #BringOurTeacherBack వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో డిమాండ్ మొదలెట్టారు. మంత్రివర్గంలో శైలజ తప్పకుండా ఉండాల్సిన వ్యక్తి అని, ఆమెకు అన్యాయం జరిగిందని నటి పార్వతి ట్వీట్ చేశారు. శైలజ లాంటి ఉత్తమమైన నేత అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందన్నారు. మట్టనూర్ నియోజకవర్గం నుంచి ఆమె 60 వేల భారీ మెజారిటీతో విజయం సాధించారని, కేరళలోని 140 స్థానాల్లో అదే అత్యధికమని.. అయినా సరే ఆమెకు మంత్రి పదవి కోసం పోరాడాల్సి వస్తోందని పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత విపత్కర సమయంలో ఆరోగ్యశాఖ మంత్రికి చోటు కల్పించకపోవడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మాళవిక మోహనన్ అన్నారు.

తొలి దశలో కరోనాను అడ్డుకోవడంలో శైలజ కీలక పాత్ర పోషించారు. వైరస్‌ను అద్భుతంగా నియంత్రించిన ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి.  అలాగే, ప్రాణాంతక నిపా వైరస్‌ను నియంత్రించడంలోనూ శైలజ అద్భుతంగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. ఈసారి కూడా ఆమెకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించారు. కానీ ఆమెను తప్పించడం ఇప్పుడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. 

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

   an hour ago


ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

   5 hours ago


పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

   8 hours ago


సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

   12 hours ago


టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

   12 hours ago


బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు  శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

   a day ago


తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

   21-06-2021


ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

   21-06-2021


పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

   21-06-2021


హరీష్ రావు పై ప్రశంశల వర్షం

హరీష్ రావు పై ప్రశంశల వర్షం

   21-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle