newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

14-05-202114-05-2021 09:36:51 IST
Updated On 14-05-2021 09:43:57 ISTUpdated On 14-05-20212021-05-14T04:06:51.726Z14-05-2021 2021-05-14T04:06:48.317Z - 2021-05-14T04:13:57.216Z - 14-05-2021

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గుజ‌రాత్ అంటే ఓ ఇది. గుజ‌రాత్ అంటే  ఓ అది. గుజ‌రాత్ వాళ్ల దేశభ‌క్తి వేరు. గుజ‌రాత్ వాళ్ల ఇంట‌లిజెన్స్ వేరు.  గుజ‌రాత్  వాళ్ల థాట్ ప్రాసెస్ వేరు. అభివృద్ధి అంటే ఏంటో వాళ్ల‌కి తెలిసిన‌ట్లుగా ఎవ‌రికీ తెలీదు అనుకున్నారు. ఇదంతా ఒక‌ప్ప‌టి మాట‌.  ఎందుకంటే.. గుజరాత్ కి ఐకాన్ గా నిలిచారు పీఎం మోడీ. అప్ప‌ట్లో సీఎంగా ఎన్నో అద్భుతాలు సృష్టించినట్లు పేరు తెచ్చుకున్నారు. మూడు సార్లు సీఎం గా గెలిచి.. తిరుగులేని లీడ‌ర్ అనిపించుకున్నారు. ఇక సోష‌ల్ మీడియా అయితే.. కోడై కూసింది. అలా అలా పీఎం అయ్యారు మోడీ. ఇప్పుడు లెక్క‌లు మారిపోయాయి.

మోడీ సీఎంగా ఒక రాష్ట్రాన్ని ప‌రిపాలించ‌డంలోనే ఫెయిల్ అయ్యారు. గుజ‌రాత్ డెవ‌ల‌ప్ మెంట్ అంతా.. ఒట్టి బూట‌క‌మే.. ఏదో సోష‌ల్ మీడియా డ‌బ్బా కొట్ట‌డం వ‌ల్ల‌.. అంత హైలైట్ అయ్యారు. అంతే త‌ప్ప‌.. అంత విష‌యం ఏమీ లేదు అంటున్నారు. ఒక వేళ‌.. మోడీ మంచి లీడ‌రే అయినా.. ఒక రాష్ట్రాన్ని ప‌రిపాలించే స‌త్తా ఉంటే ఉండొచ్చు కానీ.. ఒక దేశాన్ని ప‌రిపాలించే స‌త్తా మోడీకి లేదు అంటున్నారు. నోట్ల ర‌ద్దు నుంచి.. రైతుల ఉద్య‌మం నుంచి.. ఇప్ప‌టి క‌రోనా దాకా.. మోడీవి అన్నీ త‌ప్పుడు నిర్ణ‌యాలే అంటున్నారు. ఇక మోడీ పీఎం అభ్య‌ర్థిగా ఉంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి క‌ష్ట‌మే అని లెక్క‌లేస్తున్నార‌ట లీడ‌ర్లు. 

ఇక బీజేపీలో మోడీ తీరు కూడా మిగ‌తా లీడ‌ర్ల‌కి న‌చ్చ‌డం లేద‌ట‌. బీజేపీ అంటే త‌న‌దే అన్న‌ట్లు ఉన్నార‌ని.. కొంద‌రు లీడ‌ర్లు తెగ ఫీలైపోతున్నార‌ట‌. ముఖ్యంగా యువ నేత‌లు ఎక్కువ‌గా స‌ఫ‌ర్ అవుతున్నార‌ట‌.  యువ నేత‌లు ఎదిగితే.. త‌మ ఫార్ములా ప్ర‌కారం.. సీనియ‌ర్  లీడ‌ర్లు త‌ప్పుకోవాలి క‌దా. ఎందుకంటే.. మోడీ అమిత్ షాలు వ‌చ్చి.. సీనియ‌ర్ లీడ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టేశారు క‌దా. సో.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి వీళ్లు కూడా చేరిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. అందుకే.. యువ నేత‌ల‌ను ఎద‌గ‌నివ్వ‌డం లేద‌ని.. ఆల్రెడీ గుజ‌రాతీలే పెద్ద పద‌వుల్లో ఉండ‌డం.. మోడీ, అమిత్ షాలు త‌మ‌దే బీజేపీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం, ఆర్ఎస్ఎస్ ప్ర‌భావం కూడా పార్టీపై లేకుండా చేయ‌డంతో అంద‌రూ ఉడికిపోతున్నార‌ట‌. 

ఇన్నాళ్లూ అంటే.. మోడీని షాని క‌దిలించే ప‌రిస్థితి లేదు. వారికి ఎదురే లేదు అన్న‌ట్లుగా ఉంది ఎవ్వారం. ఇప్పుడు క‌రోనా, రైతుల ఉద్య‌మంతో నెగ‌టివిటీ పెరిగింది క‌దా. ఇదే టైంలో.. మోడీ, షాల‌ను ప‌క్క‌కి జ‌రిపే ప్లాన్స్ లో ఉన్నార‌ట బీజేపీలోని మిగ‌తా లీడ‌ర్లు. అస‌లు గుజ‌రాత్ వాళ్ల‌ని పెద్ద పెద్ద ప‌ద‌వుల‌కి కాస్త దూరంగా ఉంచాలి. లేదంటే.. పార్టీ  మొత్తం త‌మ‌దే అన్న‌ట్లు ఉంటున్నార‌ని.. మ్యాపులు గీస్తున్నార‌ట‌. మోడీ, షా ల‌పై నెగ‌టివిటీని ఈ విధంగా  ఉప‌యోగించుకోవాలి అని లెక్క‌లేస్తున్నార‌ట‌.

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

   an hour ago


ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

   4 hours ago


పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

   8 hours ago


సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

   11 hours ago


టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

   12 hours ago


బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు  శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

   a day ago


తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

   21-06-2021


ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

   21-06-2021


పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

   21-06-2021


హరీష్ రావు పై ప్రశంశల వర్షం

హరీష్ రావు పై ప్రశంశల వర్షం

   21-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle