newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

బీహార్ లో ఒక్కసారిగా 72 శాతం పెరిగిన మరణాలు

10-06-202110-06-2021 11:44:24 IST
2021-06-10T06:14:24.331Z10-06-2021 2021-06-10T06:14:21.607Z - - 22-06-2021

బీహార్ లో ఒక్కసారిగా 72 శాతం పెరిగిన మరణాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీహార్ లో కరోనా మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. పాత లెక్కలతో పోల్చి చుస్తే 72 శాతం ఎక్కువగా మరణాలు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రవ్యాప్తంగా మరణాల సంఖ్య 9,429 గా ఉందని నితీష్ కుమార్ ప్రభుత్వం బుధవారం తెలిపింది.

రాష్ట్రంలో కరోనా మరణాల స్థాయిని బీహార్ ప్రభుత్వం దాచిపెడుతోందన్న ఆరోపణలు రావడంతో పాట్నా హైకోర్టు ఏప్రిల్-మే రెండు నెలల్లో కోవిడ్‌ మరణాలపై ఆడిట్ కు ఆదేశించింది. మూడు వారాల ఆడిట్ తరువాత కొత్త గణాంకాలు చుస్తే ఆశ్చర్యం కలుగుతుంది.  మార్చి 2020 లో రాష్ట్రంలో కరోనా తో 1,600 మంది మరణించగా,  2021 ఏప్రిల్, మే లలో మరణించిన వారి సంఖ్య దాదాపు 7,775 ఉంది, 

గత ఏడాదితో పోలిస్తే ఇది ఆరు రెట్లు ఎక్కువ.

అన్ని జిల్లాల నుండి ధృవీకరణ తర్వాత 72 శాతం ఎక్కువ మరణాలు వచ్చినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాని ఈ అదనపు మరణాలు ఎప్పుడు జరిగాయో పేర్కొనలేదు. కొత్త గణాంకాల ప్రకారం అత్యధిక మరణాలు రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగాయి. 

పాట్నాలో ప్రభుత్వం నడుపుతున్న మూడు దహన కేంద్రాల రికార్డులు 3,243 "కోవిడ్ దహన సంస్కారాలను" ధృవీకరిస్తున్నాయి మరియు తాజా వ్యత్యాసం మరింత ప్రతిపక్ష విమర్శలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

 

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

   an hour ago


ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

   5 hours ago


పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

   8 hours ago


సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

   12 hours ago


టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

   12 hours ago


బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు  శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

   a day ago


తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

   21-06-2021


ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

   21-06-2021


పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

   21-06-2021


హరీష్ రావు పై ప్రశంశల వర్షం

హరీష్ రావు పై ప్రశంశల వర్షం

   21-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle