newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అల్లర్లతో బెంగాల్ బెంబేలు ఎవరు బాధ్యులు?

04-05-202104-05-2021 21:22:50 IST
Updated On 05-05-2021 06:57:46 ISTUpdated On 05-05-20212021-05-04T15:52:50.389Z04-05-2021 2021-05-04T15:52:48.293Z - 2021-05-05T01:27:46.130Z - 05-05-2021

అల్లర్లతో బెంగాల్ బెంబేలు  ఎవరు బాధ్యులు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ముందు తతంగం ఎంత ఉత్కంఠను రేకెత్తించిందో అనంతర పరిస్థితి కూడా అంత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పార్టీ అధినేత్రి మమత ఓడినా ఆమే బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఒక్కసారిగా హింసాకాండ ప్రజ్వరిల్లింది.

ఈ దాడుల్లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. పరిస్థితి తీవ్రం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర గవర్నర్ కు ఫోన్ చేసి వాకబు చేశారు. అసలు హింసాకాండకు కారకులెవరన్నది అంతుబట్టకుండా ఉంది. ఏ పార్టీకి ఆ పార్టీ తమ కార్యకర్తలే మరణించారంటూ చెప్పుకోవడంతో దోషులెవరో తేలకుండా ఉంది. తమ కార్యకర్తలు తొమ్మిది మంది చనిపోయారని బిజెపి చెబుతోంది. తమ కార్యకర్తలే ముగ్గురు బలయ్యారని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. అలాగే కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ కూటమి కూడా తమ కార్యకర్త మరణించాడని అంటోంది.

అన్ని పార్టీలు ఈ హింసకు బలయ్యామని చెబుతుండటంతో రంగంలోకి దిగిన కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తక్షణమే నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతిపక్షాలనే లక్ష్యంగా చేసుకొని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఇందుకు పాల్పడిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర హోమ్ కార్యదర్శి, డిజిపిలను రాజ్ భవన్ కు పిలిపించిన గవర్నర్ ధన్కర్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో విడిగా సమావేశమైన ఆయన హింస, దహనకాండ, లూటీలు, హత్యలను తక్షణమే ఆపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ హింసకు ఎవరు బాధ్యులు, శాంతి పరిరక్షణ ఎవరి బాధ్యత అన్న దానిపై గందరగోళం నెలకొంది.

తమ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు శాంతి భద్రతల బాధ్యత తమది కాదని మమతా బెనర్జీ అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మోహరించిన కేంద్ర బలగాలే  ఈ బాధ్యతను తీసుకోవాలని చెబుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా కేంద్ర బలగాలతో కలసి బి జె పి ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. మరో పక్క రాష్ట్రంలో పరిస్థితి గురించి తెలుసుకునేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బెంగాల్ వచ్చారు. ఈ అల్లర్లను దేశ విభజన సమయంలో జరిగిన సంఘటనలుగా ఆయన అభివర్ణించారు. బెంగాల్ లో హింసకు నిరసనగా దేశవ్యాప్త నిరసనలు తెలుపుతామని బిజెపి చెబుతోంది. గత 48 గంటల్లో పశ్చిమ బెంగాల్ లో వందలాది తమ కార్యాలయాలు, కార్యకర్తల ఇఇళ్ళు ధ్వంసం అయ్యాయని బిజెపి చెబుతోంది. టి ఎం సి మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను కొట్టి పారేసింది.  బిజెపి లో ఉన్న అంతః కలహాలే ఈ దాడులకు కారణమని స్పష్టం చేసింది.    

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   2 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   4 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   10 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   10 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   8 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   11 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   7 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   11 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle