మే 11 నుండి గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం ప్రారంభం
09-05-202209-05-2022 08:38:58 IST
2022-05-09T03:08:58.508Z09-05-2022 2022-05-09T03:08:52.809Z - - 27-05-2022

ఈ నెల 11 నుండి గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒక్కో సచివాలయం పరిధిలో రెండు రోజులపాటు పర్యటించి.. ప్రతి ఇంటి గడపకూ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు వెళ్లనున్నారు. ఆ ఇంటి సభ్యులకు మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన ప్రయోజనాన్ని, సంక్షేమాభివృద్ధి పథకాలకు మారీచుల్లా అడ్డుపడుతున్న దుష్టచతుష్టయం (టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5) తీరును వివరించి.. తమకు తోడుగా ఉండాలని కోరనున్నారు. కాగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ రికార్డు విజయాన్ని సాధించింది. అధికారం చేపట్టిన మూడేళ్లలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం చెప్పారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రమాణికంగా.. ఎలాంటి అవినీతికి తావు ఇవ్వకుండా.. డీబీటీ (నగదు బదిలీ) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.1,38,894 కోట్లు జమ చేశారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో నిరుపేద లబ్ధిదారులకు ఆర్థిక సమస్యలు లేకుండా చేశారని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. ఇళ్లు లేని 31 లక్షలకుపైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి.. గృహాలను నిర్మిస్తున్నారు. ఏకంగా 17,005 ఊళ్ల (వైఎస్సార్ జగనన్న కాలనీలు)ను కట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని పరిశీలకులు చెబుతున్నారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్‌కు దీటుగా ఆధునికీకరిస్తున్నారు. రహదారులను అభివృద్ధి చేశారు. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు వీటన్నింటినీ ప్రతి ఇంటికీ వెళ్లి వివరించడంతో పాటు.. ఎన్నికల మేనిఫెస్టో, మూడేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులకు చేకూర్చిన ప్రయోజనాన్ని వివరిస్తూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను ఆ కుటుంబానికి అందించి, ఆశీర్వదించాలని కోరనున్నట్లు తెలుస్తోంది.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా