newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన హంతకులు ఆ ఇద్దరే..

11-09-202111-09-2021 21:20:39 IST
Updated On 11-09-2021 22:24:49 ISTUpdated On 11-09-20212021-09-11T15:50:39.954Z11-09-2021 2021-09-11T15:50:37.668Z - 2021-09-11T16:54:49.511Z - 11-09-2021

వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన హంతకులు ఆ ఇద్దరే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ని హత్య చేసిన హంతకులు ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లే అని సిబిఐ నిర్ధారణకి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. సీబీఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు ప్రకారం అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ వివేకాను హత్య చేసినట్లుగా సీబీఐ స్పష్టంగా చెప్పిందని, తమకు లభించిన ఆధారాల ప్రకారం ఈ ఇద్దరే వివేకాను హత్య చేశారనటానికి చాలా ఆధారాలున్నట్లు సీబీఐ పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన సమాచారం ప్రకారం దర్యాప్తు అధికారులు సునీల్ యాదవ్ ను అరెస్టుచేసి విచారించారు. వీరి విచారణలో ఉమాశంకర్ రెడ్డి పాత్ర బయటపడింది. ఈ ఉమాశంకర్ ఎవరంటే వివేకా పీఏ సోదరుడట. యాదవ్, ఉమాశంకర్ ఇద్దరు వివేకా హత్యకు ముందు వాళ్ళింట్లో కుక్కను మోటారు సైకిల్ తో గుద్ది చంపేసినట్లు సీబీఐ చెప్పింది. తర్వాత వివేకాను హత్య చేయటానికి వీళ్ళద్దరు పల్సర్ బైక్ లో గొడ్డలి తీసుకుని వెళ్ళారట. ఈ నేపధ్యంలో వివేకా తలపై గొడ్డలితో నరికినట్లు పోస్టుమార్టమ్ లో తేలిన విషయాలను సీబీఐ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. హత్య తర్వాత ఉమాశంకర్ గొడ్డలిని తీసుకుని బైకులో పారిపోయాడట. తర్వాత విచారణలో భాగంగా సీబీఐ అధికారులు బైకును, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. పోయిన నెలలో ఉమాశంకర్ ఇంట్లో సోదాలు చేసిన దర్యాప్తు అధికారులు రెండు చొక్కాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో వివేకా హత్యకు సంబంధించి మరికొందరు నిందితులను, ఆయుధాలను మాత్రం స్వాధీనం చేసుకోవాల్సుందని సీబీఐ చెప్పింది. అయితే వివేకాను హత్య చేయడానికి గల కారణాలు మాత్రం తెలియరావడం లేదని, హత్య చేసేంత కక్షలు ఏమున్నాయో అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉన్నట్లు సిబిఐ తెలిపిందని, త్వరలోనే వివేకా హత్యకు గల కారణాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సిబిఐ పేర్కొన్నట్టు సమాచారం. 

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

   11 hours ago


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

   11 hours ago


పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

   12 hours ago


బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

   a day ago


డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

   21-09-2021


అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

   21-09-2021


రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

   21-09-2021


చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

   20-09-2021


మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   20-09-2021


5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle