newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సబ్బం హరి మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన సిఎం జగన్.. నేడే అంత్యక్రియలు

04-05-202104-05-2021 08:34:27 IST
Updated On 04-05-2021 08:48:02 ISTUpdated On 04-05-20212021-05-04T03:04:27.899Z04-05-2021 2021-05-04T03:04:23.997Z - 2021-05-04T03:18:02.686Z - 04-05-2021

సబ్బం హరి మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన సిఎం జగన్.. నేడే అంత్యక్రియలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ ఎంపీ సబ్బం హరి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. సబ్బం హరి మృతిపై సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. సబ్బం హరి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2009లో కాంగ్రెస్ తరఫున అనకాపల్లి నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఓదార్పు యాత్రలో జగన్ వెంటే నడిచినప్పటికీ ఎందుకో టీడీపీలో చేరారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. మాజీ ఎంపీ సబ్బం హరి ఆకస్మిక మరణం విచారకరం అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తున్నానని వివరించారు. సబ్బం హరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

సబ్బం హరి మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. సబ్బం హరి మృతి తనను తీవ్ర విచారానికి గురిచేసిందన్నారు. ఈ కష్టకాలంలో సబ్బం హరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు వివరించారు. సబ్బం హరి తనకు మంచి మిత్రుడు అని, తనను ఎంతగానో అభిమానించేవారని తెలిపారు. మేయర్ గా పనిచేసిన కాలంలో విశాఖ నగరాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. అటు, అనకాపల్లి ఎంపీగానూ సబ్బం హరి సేవలు మరువలేనివని కీర్తించారు.

సబ్బం హరి మృతి చెందడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. సబ్బం హరి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సబ్బం హరి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. సబ్బం హరి మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. విశాఖ మేయర్ గా, ఎంపీగా సబ్బం హరి సేవలు మరువలేనివని కొనియాడారు.

తెలుగుదేశం సీనియర్ నాయకులు సబ్బం హరి గారు ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని నారా లోకేష్ ట్వీట్ చేశారు. తన నిస్వార్థ రాజకీయాలతో మాలాంటి వారికి మార్గదర్శకులుగా నిలిచారు సబ్బం హరిగారు. ఆయన లాంటి నేతను కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ఏ విషయం పై అయినా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే సబ్బం హరి గారు, ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేసారు. సబ్బం హరి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని నారా లోకేష్ తెలిపారు.

సబ్బం హరి కుమారుడు వెంకట్ మాట్లాడుతూ, ఊపిరతిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్లే తన తండ్రి మరణించారని తెలిపారు. ఈ మధ్యాహ్నం 1.22 గంటలకు తన తండ్రి తుదిశ్వాస విడిచారని చెప్పారు. నాన్నకు కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చిందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకున్నారని... అయితే, ఎన్నికల కారణంగా తీసుకోలేకపోయారని చెప్పారు. కేఆర్ఎం కాలనీ శ్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహిస్తామని వెంకట్ తెలిపారు. కరోనా తీవ్రత నేపథ్యంలో అంత్యక్రియలకు ఎవరూ రావద్దని ఆయన కోరారు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   an hour ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   3 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   9 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   9 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   7 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   10 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   6 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   11 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle