newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

వై.ఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్: 20న చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రముఖులు సీఎం తో భేటీ

14-09-202114-09-2021 15:21:23 IST
Updated On 14-09-2021 15:22:26 ISTUpdated On 14-09-20212021-09-14T09:51:23.161Z14-09-2021 2021-09-14T09:51:11.102Z - 2021-09-14T09:52:26.691Z - 14-09-2021

వై.ఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్: 20న చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రముఖులు సీఎం తో భేటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న టాలీవుడ్ చిత్రపరిశ్రమ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అపాయింట్‌మెంట్ దొరికింది. పూర్వం ఏపీ ప్రభుత్వం టికెట్ చార్జీలు, అదనపు షోలు విషయంలో జీవో జారీ చేసింది. కొంత మంది చిన్న నిర్మాతలు ఆ జీవో ను సమర్దించగా, బడా నిర్మాతలు ఆ జీవో ను వ్యతిరేకిస్తున్నారు. టికెట్ చార్జీల విషయంలో అయితే నిర్మాత సురేష్ బాబు ఏకంగా ఆ రేట్లకు అయితే నేను ఏపీలో థియేటర్లు నడపనని బాహాటంగానే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తేల్చి చెప్పేసారు. 

మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సురేష్ బాబు, నాగార్జున బృందం ఈ నెల 20న జరగబోయే సమావేశంలో తెలుగు చిత్రపరిశ్రమ సమస్యలతో పాటు టికెట్ ధరల గురించి, అదనపు షోల గురించి కూడా చర్చిస్తారని సమాచారం. తాజగా సినిమా టికెట్ బుకింగ్ కూడా ఏపీ ప్రభుత్వ పోర్టల్ నుంచే చేపడతామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై కూడా కొందరు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు సీఎం పై గుర్రుగా ఉన్నారు. ఈ ఆన్లైన్ పోర్టల్ గురించి కూడా చర్చిస్తారని సమాచారం. రాష్ట్ర సమాచార శాఖ మంత్రిపేర్ని నాని ఈ సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి వారికి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరికేలా చేసారని సమాచారం. 

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

   10 hours ago


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

   11 hours ago


పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

   11 hours ago


బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

   a day ago


డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

   a day ago


అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

   21-09-2021


రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

   21-09-2021


చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

   20-09-2021


మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   20-09-2021


5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   20-09-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle