newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

25-07-202125-07-2021 08:04:44 IST
Updated On 25-07-2021 09:08:44 ISTUpdated On 25-07-20212021-07-25T02:34:44.628Z25-07-2021 2021-07-25T02:34:01.416Z - 2021-07-25T03:38:44.089Z - 25-07-2021

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పదవుల పండుగ చేయనున్నారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయ్యాక ఏపీ చరిత్రలోనే తొలిసారిగా దాదాపు 130 మందికి నామినేటెడ్ పోస్తులని ఇచ్చిన ఘనత దక్కించుకున్న వైఎస్ జగన్  ఇప్పుడు.. తాజాగా స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించిన ప‌ద‌వుల‌ను పంచేందుకు సిద్దమయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ కూడా జారీ చేసింది. దీని ప్ర‌కారం.. ఈ నెల 30న ప‌ద‌వుల పంప‌కానికి రంగం సిద్ధ‌మైంది. 11 మున్సిపల్‌ కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం ఎస్‌ఈసీ ప్రకటన జారీ చేసింది. 75 మున్సిపాలిటీలు / నగర పంచాయతీల్లో రెండో వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక చేప‌ట్ట‌నున్నారు.

వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌రకు అంటే.. రాష్ట్ర చ‌రిత్ర‌లో మునిసిపాటిల్లో ఒక మేయ‌ర్‌, ఒక డిప్యూటీ మేయ‌ర్‌కు మాత్ర‌మే అవ‌కాశం ఉంది. అయితే.. వైసీపీ స‌ర్కారు అంద‌రికీ న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో.. నేత‌ల అభిమ‌తాల‌కు అనుగుణంగా.. అడుగులు వేసింది. ఈ క్ర‌మంలోనే పంచాయ‌తీ రాజ్ చ‌ట్టానికి సైతం మార్పులు చేస్తూ.. కొత్త జీవో తీసుకువ‌చ్చి.. ఎన్నిక‌ల స‌మ‌యంలోను.. పార్టీలోనూ.. కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వారిని స‌ముచితంగా గౌర‌వించాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ నేప‌థ్యంలో.. రెండో డిప్యూటీ మేయ‌ర్‌ను నియ‌మించాల‌ని భావించింది.

ఈ క్ర‌మంలో నేతల ఎన్నిక కోసం ఈనెల 30న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. పురపాలికల్లో రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక చేప‌ట్టనున్నారు. కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రెండో వైస్‌ ఛైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు.. ఎస్ఈసీఈ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఈ ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీంతో వైసిపి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు తీసుకువచ్చే అవకాశం ప్రభుత్వం కల్పించింది. పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి సహకరించి, పార్టీ కోసం నిరంతరాయంగా పని చేస్తున్న కార్యకర్తలని గుర్తించి వారికి సముచిత గౌరవం అందించేందుకు ఈ పదవులు దోహద పడతాయని తద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని సిఎం వైఎస్ జగన్ ఆకాంక్ష.

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

   11 hours ago


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

   12 hours ago


పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

   12 hours ago


బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

   21-09-2021


డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

   21-09-2021


అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

   21-09-2021


రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

   21-09-2021


చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

   20-09-2021


మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   20-09-2021


5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle