newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

ఏంటి ర‌జ‌నీ మేడ‌మ్.. అస‌లు క‌థ అదేనా

30-10-202030-10-2020 14:14:15 IST
Updated On 02-11-2020 15:19:41 ISTUpdated On 02-11-20202020-10-30T08:44:15.344Z30-10-2020 2020-10-30T08:44:11.322Z - 2020-11-02T09:49:41.108Z - 02-11-2020

ఏంటి ర‌జ‌నీ మేడ‌మ్.. అస‌లు క‌థ అదేనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎప్పుడొచ్చామ‌న్న‌ది కాదు.. మంత్రి ప‌ద‌వి వ‌చ్చిందా లేదా. బ‌స్. అంతే ముచ్చ‌ట‌. అదే లెక్క‌.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ కూడా అదే టార్గెట్ చేస్తున్నారు. అంతేగా మ‌రి. దీనికి ప‌బ్లిసిటీ మెయిన్ టార్గెట్ అనుకుంటున్నారు కావ‌చ్చు. అఫ్ కోర్స్.. పొలిటిక‌ల్ గా ఎద‌గాలంటే అస‌లు అస్త్రం అదే క‌దా.. త‌ర్వాత కావాల్సిన అస్త్ర శ‌స్త్రాలు ఎలా ఉన్నా.. ఇది మెయిన్. మిస్ అయితే.. మాటొస్త‌ది అని అయినా ఇచ్చేలా ఉండాలి క‌దా. అందుకే కావ‌చ్చు. వైసీపీ ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ ఏ ఒక్క ఛాన్స్ నీ వ‌దులుకోవ‌డం లేదు. మెయిన్ గా ప‌బ్లిసిటీ పై ఫోక‌స్ చేశారు. మీడియా ఎలాగూ.. త‌నంటే స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ చూపిస్తుంది. కెమెరాలు ర‌య్యి ర‌య్యిన తిరుగుత‌య్. అందుకే కావ‌చ్చు.. ఆ కెమెరాల్ని క‌రెక్ట్ రూట్ లో ఫ్రేమ్ చేయిస్తున్నారు.