newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

నారా లోకేశ్ కి విడ‌ద‌ల ర‌జ‌నీ షాక్

28-10-202028-10-2020 14:23:58 IST
Updated On 28-10-2020 14:46:16 ISTUpdated On 28-10-20202020-10-28T08:53:58.965Z28-10-2020 2020-10-28T08:53:53.865Z - 2020-10-28T09:16:16.936Z - 28-10-2020

నారా లోకేశ్ కి విడ‌ద‌ల ర‌జ‌నీ షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ ఏది జ‌రిగినా అది ఇంకొక‌రితో కంపారిజ‌న్ కి వాడుకుంటూ కామెడీలు చేస్తుంటారు. ఇప్పుడు టీడీపీ లీడ‌ర్ నారా లోకేశ్ ది కూడా అదే ప‌రిస్థితి. పాపం నారా లోకేశ్. సోష‌ల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ట్రాక్ట‌రే న‌డ‌పడం చేత‌కాదు.. పార్టీని ఎలా న‌డుపుతావ్ అని కొంత‌మంది.. ప‌ది మందిని క‌రెక్ట్ గా ప్రొటెక్ట్ చేయ‌లేకుంటే.. రాష్ట్రాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తావ్ అని ఇంకొంత‌మంది.. ఏంటిరో.. మీ సార్ ట్రాక్ట‌ర్ డొల్ల‌కొట్టాడ‌ట క‌దా అని.. కార్య‌క‌ర్త‌ల్ని అంటూ కామెడీలు చేసుకుంటున్నారు.

ఇదే టైమ్ లో వైసీపీ ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ ట్రాక్ట‌ర్ ఎక్కారు. ఎంచ‌క్కా.. డ్రైవ్ చేసుకుంటూ బిందాస్ గా వెళ్లారు. ఇప్పుడీ వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.. అంద‌రూ చూస్తున్నారు. మామూలుగానే విడ‌ద‌ల ర‌జ‌నీకి కాస్త ఫాలోయింగ్ ఎక్కువుంది. మీడియాలో ఇంకాస్త ఎక్కువుంది. ఈ ట్రాక్ట‌ర్ తో ఇంకాస్త సెటైర్ గా మారింది. విడ‌ద‌ల ర‌జ‌నీ మామూలుగా ఇంత‌కు ముందు కూడా ట్రాక్ట‌ర్ న‌డిపారు. ఆమెకు బానే ఆల‌వాటున్న‌ట్లుంది. కానీ.. సిచ్చువేష‌న్ వేరు క‌దా. లోకేశ్ కి ఇది సెటైర్ గా మారింది. లోకేశ్ కి ట్రాక్ట‌రే న‌డ‌పడం చేత‌కాలేదు.. బుర‌ద‌గుంట‌లోకి దించారు.. మా ర‌జ‌నీ మేడ‌మ్ చూశారా ఎలా న‌డిపారో అంటూ.. కిందిస్థాయిలో కామెడీలు చేసుకుంటున్నారు. కింది స్థాయిలో ఏంటి.. అంద‌రూ అలాగే మాట్లాడుకుంటున్నారు.

చదవండి: విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

పాపం నారా లోకేశ్. త‌ను న‌డిపింది వ‌ర‌ద నీటిలో. రోడ్డు మొత్తం ఫుల్ గా నీళ్లున్న‌య్. దారి క‌నిపించ‌నే లేదు. ఇక ఆ ట్రాక్ట‌ర్ మీద జ‌నాలు ఫుల్ గా ఉన్నారు. ట్ర‌క్కు కూడా ఉండ‌డంతో.. ఫాలోవ‌ర్స్ అంతా ట్రాక్ట‌ర్ ఎక్కారు. బుర‌ద కావ‌డంతో.. వీలైనంత మంది ఎక్కి స‌ర్దుకుని కూర్చున్నారు. లోకేశ్ న‌డుపుతుండ‌డంతో.. ఇంకా టైట్ గా ఎక్కారు. ఫైన‌ల్ గా ఎక్క‌డో బెసికింది.. దారి త‌ప్పింది.. బుర‌ద గుంట‌లోకి కూరుకుపోయింది. వ‌ర‌ద నీరు క‌దా.. కంట్రోల్ కాలేదు. కానీ ఏం చేస్తాడు చెప్పండి. ఇవ‌త‌ల ఉంది విడ‌ద‌ల ర‌జ‌నీ కదా.. కంపార్ చేస్తూ‌.. లోకేశ్ ని ట్రోల్ చేస్తున్నారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!

   14-05-2022


టీఆర్‌ఎస్‌ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్‌ సావంత్‌ విమర్శలు

టీఆర్‌ఎస్‌ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్‌ సావంత్‌ విమర్శలు

   13-05-2022


నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన

   13-05-2022


నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక

   13-05-2022


ఏపీ కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..

ఏపీ కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..

   13-05-2022


గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే

   12-05-2022


శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే

   12-05-2022


ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అనూహ్య నిర్ణయం

ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అనూహ్య నిర్ణయం

   12-05-2022


ఫిలిప్పీన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్‌ గెలుపు!

ఫిలిప్పీన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్‌ గెలుపు!

   11-05-2022


ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా

   11-05-2022


ఇంకా

Newssting User


.
 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle