ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-202213-05-2022 07:45:23 IST
2022-05-13T02:15:23.084Z13-05-2022 2022-05-13T02:14:57.652Z - - 27-05-2022

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ భేటీలో వ్యవసాయానికి, ప్రాజెక్టులకు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సాగునీరు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం. గతేడాది కంటే ముందుగా వ్యవసాయ సీజన్ ప్రారంభించాలని, సాగుకు సరిపడా నీటిని నిల్వచేయాలని నిర్ణయం. ధవళేశ్వరం వద్ద డెడ్ స్టోరేజీని వినియోగించుకోవాలి. జూన్ 10 నుంచి కృష్ణా డెల్లా, పులిచింతల నీటి వినియోగం. జూన్ 30 నుంచి రాయలసీమ ప్రాజెక్టుల నీరు వినియోగం. నీటి వినియోగానికి సంబంధించి రైతులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. ఈ క్రమంలో రైతులు ఖరీఫ్‌కు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అంబటి సూచించారు. ఖరీఫ్ సీజన్‌ను ముందే ప్రారంభిస్తే. పంట కూడా ముందుగానే చేతికి వస్తుందని ఆయన తెలిపారు. నవంబర్‌లో తుఫానులు వచ్చే నాటికే పంట చేతికి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన రైతులు కూడా మూడు పంటలు వేసుకునే వెసులుబాటు ఉంటుందని ఆయన తెలిపారు. గతంలో ప్రాజెక్టులు నిండాక ఆగస్టులో నీరు విడుదల చేసేవారని, తాము మాత్రం ముందుగానే నీటిని విడుదల చేయనున్నామని అంబటి స్పష్టం చేశారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022

సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసిపీలో చేరిన టీడీపీ, జనసేన నేతలు
11-05-2022
ఇంకా