పార్టీ బలోపేతమే లక్ష్యంగా గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం
09-05-202209-05-2022 08:47:02 IST
2022-05-09T03:17:02.955Z09-05-2022 2022-05-09T03:16:58.286Z - - 27-05-2022

ప్రజలతో మరింతగా మమేకమవడానికి గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత నెల 27న నిర్వహించిన సమావేశంలో ఈ కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించి.. విజయవంతం చేసే బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులకు అప్పగించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను జిల్లా అధ్యక్షులు, మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలు సమన్వయం చేయనున్నారు. రోజూ ఈ కార్యక్రమాన్ని సమీక్షించే బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తల కో–ఆర్డినేటర్, వైఎస్సార్పీపీ నేత వి.విజయసాయిరెడ్డికి సీఎం అప్పగించారు. ఈ కార్యక్రమ తీరుతెన్నులను తాను కూడా క్రమం తప్పకుండా సమీక్షిస్తానని స్పష్టం చేశారు. సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమం ముగిసేలోపే.. బూత్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో 50 శాతం మహిళలకు స్థానం కల్పించనున్నారు. తద్వారా బూత్ స్థాయి నుంచే పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆఖండ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే క్రియాశీలకం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా