మాజీ మంత్రి నారాయణ ఆదేశాలతోనే ప్రశ్నా పత్రాలు లీకు
11-05-202211-05-2022 08:47:55 IST
2022-05-11T03:17:55.671Z11-05-2022 2022-05-11T03:17:51.813Z - - 27-05-2022

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ ఆదేశాలు, ప్రణాళిక తోనే ఆ విద్యా సంస్థ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి పదో తరగతి ప్రశ్నపత్రాల లీకుని పక్కాగా అమలు చేశారని, చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో మొత్తం చక్రం తిప్పింది పొంగూరు నారాయణనే అని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో టీడీపీ నేత నారాయణను హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అరెస్టు చేశామన్నారు. అక్కడ నుంచి తీసుకొచ్చి చిత్తూరులోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని వివరించారు. అలాగే తిరుపతి నారాయణ విద్యాసంస్థల డీన్ బాలగంగాధర్ (36)ను కూడా అరెస్టు చేశామని చెప్పారు. ఈ మేరకు చిత్తూరులో ఎస్పీ రిషాంత్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 27న ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రాన్ని తిరుపతి నారాయణ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్.గిరిధర్‌రెడ్డి ‘చిత్తూరు టాకీస్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనిపై చిత్తూరు డీఈవో పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఏప్రిల్ 29న తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీకృష్ణారెడ్డి చైతన్య ప్రిన్సిపాల్ పి.సురేష్, తిరుపతి ఎన్ఆర్ఐ అకాడమీ ఆంగ్ల ఉపాధ్యాయుడు కె.సుధాకర్, తిరుపతి చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆరిఫ్, డీన్ కె.మోహన్, గిరిధర్‌రెడ్డితోపాటు గంగాధర నెల్లూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పవన్‌కుమార్‌రెడ్డి, బి.సోమును అరెస్టు చేశాం. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మినహా మిగిలినవాళ్లు గతంలో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసినవారే. మరికొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలతో కలిసి.. నిందితులు.. గిరిధర్‌రెడ్డి, సుధాకర్, సురేష్, పవన్‌కుమార్‌ను ఈ నెల 9న కస్టడీకి తీసుకుని విచారించాం. నారాయణ ఆదేశాలతోనే ఇదంతా చేసినట్లు వారు అంగీకరించారు. నారాయణ ఆదేశాలతో ఆ సంస్థ సిబ్బంది మరికొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల ప్రతినిధులతో కలిసి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా