newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలుగు రాష్ట్రాల్లో టీకాలు వేసే ప‌రిస్థితి లేదు

01-05-202101-05-2021 08:59:57 IST
2021-05-01T03:29:57.146Z01-05-2021 2021-05-01T03:29:35.230Z - - 14-05-2021

తెలుగు రాష్ట్రాల్లో టీకాలు వేసే ప‌రిస్థితి లేదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అవును. అంతా గంద‌ర గోళం. ఎవ‌రు ఏం చేస్తున్నారో తెలీదు. ఏపీ ఏం చేస్తుందో. ఏపీ అధికారులు ఏం చేస్తున్నారో క్లారిటీ లేదు. ఇవ్వాళ్టి నుంచి.. 18 ఏళ్లు నిండిన ప్ర‌తి వారికీ టీకా వేయాలి. యాప్ లో బుక్ చేసుకున్న వారికి టీకా వేయాల‌ని ఆర్డ‌ర్స్ ఉన్న‌య్. ప్రాసెస్ స్టార్ట్ కావాలి. కానీ.. ఏపీలో మాత్రం 18  ఏళ్లు నిండిన వారికి టీకా వేసే ప‌రిస్థితి లేదు. ఎందుకు.. స‌ర్కార్ కి ఏమైంది అని జ‌నం క్వ‌శ్చ‌న్ చేస్తే.. రాష్ట్ర స‌ర్కార్ కి ఏమీ కాలేదు. మేం రెడీగానే ఉన్నాం.. కేంద్ర స‌ర్కార్ టీకా పంప‌డం లేదు అంటోంది ఏపీ స‌ర్కార్. సో.. సైలెంట్ గా వారిపై త‌ప్పు నెట్టేసి.. ఏపీ స‌ర్కార్ మాత్రం టీకా వేసే విష‌యంలో త‌ప్పించుకుంటోంది.  ముందు నుంచే అంచ‌నా వేసి.. తెప్పించుకోవ‌చ్చు క‌దా. లెక్క‌లు వేసి ఆర్డ‌ర్ చేసుకోవ‌చ్చు క‌దా. ఉన్న టీకాల‌ని అంద‌రికీ స‌ర్ద‌డం కుద‌ర‌దా అనేది వేరే క్వ‌శ్చ‌న్. 45 ఏళ్లు నిండిన వారికే ఇంకా టీకాలు చాల‌డం లేదు అంటున్నారు.

ఇటు తెలంగాణ‌లో కూడా సేమ్ టు సేమ్ ఎవ్వారం ఉంది. 18 ఏళ్లా.. 45 ఏళ్లా అనేది వ‌దిలేద్దాం. ఈ శని, ఆది వారాల్లో కూడా టీకా వేసే పరిస్థితి లేదు. ఎందుకయ్యా అంటే సేమ్ ఆన్స‌ర్. తెలుగు రాష్ట్రాలు ఒక‌టే కదా. ఆన్స‌ర్ కూడా సేమ్ టు సేమ్ ఇస్తున్నాయి. కేంద్రం నుంచి టీకాలు రాలేదు. సో.. ఇవ్వ‌డం లేదు. అందుకే.. ఈ శ‌నివారం అంటే.. ఇవ్వాళ‌.. ఈ ఆదివారం అంటే రేపు.. క‌రోనా టీకాలు ప్ర‌భుత్వం వేయ‌దు. కాబ‌ట్టి.. జ‌నాలు కూడా క‌రోనా టీకా సెంట‌ర్ల‌కి వెళ్ల‌కుండా ఉంటే మంచిది.

మ‌రి టీకాలు ఉన్న‌ప్పుడు క‌రెక్ట్ గా వేస్తున్నారా అనేది ఇంకో క్వ‌శ్చ‌న్. నిజ‌మే.. టీకాలు వేసుకోవాలంటే జ‌నం టెన్ష‌న్ ప‌డుతున్నారు. మ‌రి వారికి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారా.. అది ఎవ‌రు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అవేర్నెస్ క‌లిగించాలి క‌దా అంటే మాత్రం నో ఆన్స‌ర్. ఎందుకంటే ఈ విష‌యంలో కేంద్రంపై త‌ప్పు నెట్టేయ‌డం కుద‌ర్దు క‌దా. అలాగే.. క‌రోనా లేకున్నా.. జ‌నం టీకా వేయించుకోవాలి. కానీ.. క‌రోనా టీకా సెంట‌ర్ కి వెళ్తే.. క‌చ్చితంగా క‌రోనా వ‌చ్చేలా ఉంది ప‌రిస్థితి. గుంపులు గుంపులుగా గుళ్లో ప్ర‌సాదం, పాన‌కం కోసం జ‌నం ఎగ‌బ‌డ్డ‌ట్లే ఉంది. మ‌రి అక్క‌డేం చేస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు అంటే.. నో ఆన్స‌ర్.. ఎందుకంటే.. ఈ త‌ప్పుని కూడా కేంద్రంపై నెట్టేయ‌డం కుద‌ర్దు క‌దా. సింపుల్ గా చూస్తుంటే.. క‌రోనా టీకా తెప్పించే విష‌యంలో కానీ.. టీకాలు వేసే విష‌యంలో కానీ.. వేసే టైంలో కేర్ తీసుకునే విష‌యంలో కానీ.. తెలుగు రాష్ట్రాల‌కి స‌రైన క్లారిటీ లేదు అనేది.. జ‌నానికి క్లారిటీగా ఉన్న క్లారిటీ.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   2 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   4 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   10 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   10 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   8 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   11 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   7 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   12 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle