newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

13-05-202113-05-2021 13:28:39 IST
Updated On 13-05-2021 09:15:56 ISTUpdated On 13-05-20212021-05-13T07:58:39.456Z13-05-2021 2021-05-13T03:37:37.375Z - 2021-05-13T03:45:56.880Z - 13-05-2021

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం ఏడీబీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఇరుక్కున్న ఐదుగురిలో నలుగురు మృతి చెందగా..లారీలో, కారులో ఇరుక్కున్న క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తాళ్ళరేవు మండలం పెద్దవలస  నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

తాళ్లరేవు మండలం పెద్దవలసకు చెందిన ఓ కుటుంబం గృహ ప్రవేశ వేడుక కోసం కారులో రాజమహేంద్రవరం బయలుదేరింది  పెద్దాపురం ఏడీబీ రోడ్డుపై ఉన్న రుచి సోయా పరిశ్రమ వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న 9 మందిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఐదు నెలల చిన్నారి కూడా ఉంది. కారు డ్రైవర్ నిద్రమత్తే ఇందుకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గుంటూరు జిల్లాలోని కొల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన గ్రావెల్ చిప్స్ లారీ బోల్తా పడడంతో అందులో ఉన్న ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కొల్లూరు ఎస్టీ కాలనీకి చెందిన వీరంకి దాసు, జట్టి దినేష్‎గా పోలీసులు గుర్తించారు.

ప్రకాశం జిల్లా అద్దంకి శివారు గరటయ్య కాలనీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదాలు పలువురి కుటుంబాల్లో తీరని బాధను నింపాయి.  

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

   an hour ago


ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

   5 hours ago


పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

   8 hours ago


సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

   12 hours ago


టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

   12 hours ago


బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు  శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

   a day ago


తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

   21-06-2021


ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

   21-06-2021


పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

   21-06-2021


హరీష్ రావు పై ప్రశంశల వర్షం

హరీష్ రావు పై ప్రశంశల వర్షం

   21-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle