newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇద్ద‌రు పీకేలు ఒక‌టేనా

03-05-202103-05-2021 08:38:45 IST
2021-05-03T03:08:45.309Z03-05-2021 2021-05-03T03:08:26.916Z - - 14-05-2021

ఇద్ద‌రు పీకేలు ఒక‌టేనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పీకే అనే పేరులోనే ఏదో ఉందండి. ఆ క్రేజు.. ఆ ఇమేజు.. అబ్బో.. మామూలుగా ఉండ‌దు ఎవ్వారం. పీకే అంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి తెలిసిందే క‌దా. మెగాస్టార్ బ్ర‌ద‌ర్ గా.. ప్ర‌జారాజ్యం.. జ‌న‌సేన అంటూ ఆయ‌న పొలిటిక‌ల్ ప్ర‌యాణం అంతా అంద‌రికీ తెలిసిందే క‌దా.  అయితే.. అదే పీకే గా పేరు తెచ్చుకున్న ప్ర‌శాంత్ కిశోర్ క్రేజ్ కూడా అంతే. ఊరికే రాలేదు. ఎంతో క‌ష్ట‌ప‌డి బ్రెయిన్ ఉప‌యోగించి.. ఎత్తుల మీద పై ఎత్తులు వేస్తేనే వ‌చ్చింది. ఆయ‌న ప్ర‌శాంత్ కిశోర్.. ఈయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇద్ద‌రూ పీకేలే. ఇద్ద‌రి క్రేజూ ఒక‌టే. హండ్ర‌డ్ ప‌ర్సంట్ ఒక‌టే కాక‌పోవ‌చ్చు. ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా తెలుగులో విప‌రీత‌మైన పేరుంది. కానీ... ప్ర‌శాంత్ కిశోర్ కి మాత్రం దేశ వ్యాప్తంగా పేరుంది. రాజ‌కీయ వ్యూహ క‌ర్త‌గా ఎదురులేని బ్రిలియంట్ గా పేరు తెచ్చుకున్నారు ప్ర‌శాంత్ కిశోర్.

అంతా స‌రేగానీ.. వీరిద్ద‌రికీ పోలికేంటి అనే ఫీలింగ్ అంద‌రికీ క‌లుగుతుంది. ఎందుకొచ్చింది అంటే.. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో అంతా మ‌మ‌తా రాజ్యం అయిపోయింది. దానికి రీజ‌న్ ఆమె సుదీర్ఘ కాలం పాటు.. ప్ర‌జ‌ల్లో ఉండ‌డం.. రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా సేవ‌లు చేయ‌డం.. అన్ని పార్టీల‌నీ పాతాళ లోకం లోకి తొక్కి ప‌డేసి.. ఆమె పార్టీని ఆకాశం ఎత్తున నిర్మించుకోవ‌డ‌మే రీజ‌న్. కానీ.. ఇప్పుడు మాత్రం క్రెడిట్ అంతా పీకే ఖాతాలోకి పోయింది. పీకే ప్లాన్స్ వేయ‌డం వ‌ల్ల‌నే మ‌మ‌తా బెన‌ర్జీ గెలిచారు అంటున్నారు. అంత‌కు ముందు జ‌గ‌న్ గెల‌వడానికి రీజ‌న్ కూడా పీకే అన్నారు. అంత‌కు కేజ్రీవాల్ క్రేజ్ కంటే.. పీకే క్రేజే ఎక్కువ అయింది ఢిల్లీలో. కేజ్రీవాల్ గెల‌వ‌డానికి కూడా పీకేనే రీజ‌న్ అన్నారు.

స‌రే అంతా బానే ఉంది. పేరేదో వ‌చ్చింది. కానీ.. స‌డ‌న్ గా ఈ స్టార్ డ‌మ్ ని చూసి.. ప్ర‌శాంత్ కిశోర్ ఏదేదో ఊహించుకుంటున్నారు అనే టాక్ వ‌చ్చింది. ఇక మీద‌ట రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా  ఉండ‌ను అంటున్నారు ప్ర‌శాంత్ కిశోర్. సొంత పార్టీ పెడ‌తారు అనే టాక్ వ‌స్తోంది. రాజ‌కీయంలో నాకు ఎదురేలేదు అనే ఫీలింగ్ లో ఉన్నార‌ని.. హిపోక్ర‌సీ మోడ్ లో నుంచి పీకే బ‌య‌టికి రావాలి అంటున్నారు. ఎందుకంటే.. ఎంత పేరున్నా.. ప్రశాంత్ కిశోర్ ని చూసి కాదు ఓట్లేసింది. మ‌మ‌తా బెనర్జీ గెలుపుకి పీకే స‌పోర్ట్ చేసి ఉండొచ్చు.. కేజ్రీవాల్ గెలుపుకి స‌పోర్ట్ చేసి ఉండొచ్చు.. జ‌గ‌న్ గెలుపుకి కూడా స‌పోర్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ.. ప్ర‌శాంత్ కిశోర్ వ‌ల్లే గెలిచారు అనుకోవ‌డం క‌రెక్ట్ కాదు. ఈ క్రేజ్ తో ఓట్లొస్తాయి.. నేను జాతీయ నేత‌ను అయిపోతా అనుకోవ‌డం అంటే.. పీకే ప‌ప్పులో కాలేస్తున్న‌ట్లే అంటున్నారు. రాజ‌కీయాల్లోకి ఏదేదో ఊహించుకుని వ‌చ్చిన పీకే లాగే.. ప్ర‌శాంత్ కిశోర్ అనే పీకే కూడా బోల్తా ప‌డ‌డం ఖాయం అంటున్నారు. కావాలంటే.. ఓసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ ని అడిగితే.. ప్ర‌శాంత్ కిశోర్ కి చాలా క్లారిటీస్ వ‌స్త‌య్ అని స‌ల‌హాలు ఇస్తున్నారు.. తెలుగు పొలిటిక‌ల్ అన‌లిస్టులు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   2 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   5 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   10 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   10 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   8 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   11 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   7 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   12 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle