newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

ఏపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్

07-09-202107-09-2021 20:13:15 IST
Updated On 08-09-2021 12:12:52 ISTUpdated On 08-09-20212021-09-07T14:43:15.310Z07-09-2021 2021-09-07T14:43:05.541Z - 2021-09-08T06:42:52.503Z - 08-09-2021

ఏపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అస్తవ్యస్తమైన రోడ్ల పరిస్థితిపై ఆందోళన చేస్తున్నారు. గుంతలు పడిన దారులని, ప్రయాణించడానికి వీలు కాని దుస్థితిలో ఉన్న రోడ్లను వీడియోలు, ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జనసేన పార్టీ వినూత్న నిరసనలకు దిగింది. రోడ్లను మరమ్మతులు చేయాలని జగన్ సర్కార్ మీద ఒత్తిడి తెస్తోంది. ఒకవేళ సర్కార్ రోడ్ల మరమ్మత్తు చేయకుంటే గాంధీ జయంతి రోజున తామే శ్రమదానం చేసి రోడ్లు బాగు చేయడానికి రంగంలోకి దిగుతామని జనసేన హెచ్చరికలు జారీ చేసింది.

ఈ నేపధ్యంలో ఎపి ప్రభుత్వం సోషల్ మీడియాలో రోడ్ల పరిస్థితిపై పోరాటం చేస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తుందని, కొన్ని ప్రాంతాలలో పోలీసుల ముందే వైసిపి నాయకులు జనసేన కార్యకర్తలపై విరుచుకుపడుతున్నారని తెలుస్తోంది. ఈ విషయం జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో పవన్ తీవ్రంగా స్పందించారు. రోడ్ల అధ్వాన్న స్థితిని తమ పార్టీ కార్యకర్తలు వెలుగులోకి తీసుకొస్తే దాడులు చేసి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మొన్న భీమవరం అనకాపల్లి నేడు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో పోలీసుల సమక్షంలోనే జనసేన నాయకులపై దాడులు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడి చేస్తే నేనే స్వయంగా రోడ్లపైకి వస్తానని ఆ పరిస్థితి తీసుకు రావద్దని జనసేనాని హెచ్చరించారు. రోడ్ల దుస్థితి పై తమ కార్యకర్తలు సమస్యని ఎత్తిచూపితే వాటి పరిష్కార మార్గాలు చూడకుండా అక్రమంగా తమ కార్యకర్తలపై కేసులు బనాయించడం, భౌతిక దాడులకు పాల్పడడం ఎంతవరకు న్యాయం అని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాడు. మొత్తానికి ఈ విషయంలో పోలీసులు, వైసిపి నాయకుల అత్యుత్సాహంతో జనసేన పార్టీకి మైలేజ్ తీసుకురావడమే కాకుండా వైసిపి పరువు తీస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

   12 hours ago


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

   12 hours ago


పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

   13 hours ago


బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

   21-09-2021


డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

   21-09-2021


అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

   21-09-2021


రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

   21-09-2021


చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

   20-09-2021


మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   20-09-2021


5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle