ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ.. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో పనిచేయాలి
10-01-202210-01-2022 16:16:50 IST
2022-01-10T10:46:50.818Z10-01-2022 2022-01-10T10:46:42.232Z - - 10-08-2022

ఆంధ్రప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. వైద్య ఆరోగ్య శాఖ త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని, కోవిడ్ రిజిస్టర్‌ను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కోవిద్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించి విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. దేశ వ్యాప్తంగా ఈ వైరస్ విస్తరిస్తున్నట్లు అధికారులు వివరించారు. కోవిడ్ సోకిన వారిలో దాదాపు తేలికపాటి లక్షణాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కోవిడ్‌లో ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్ల నేపథ్యంలో మార్పులు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆ మేరకు కిట్లలో మార్పులు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. చికిత్సలో ఉపయోగించే మందుల నిల్వలను సమీక్షించాలని, అవసరమైన మేరకు వాటిని కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లో కోవిడ్ ఆంక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని సీఎం జగన్ హెచ్చరించారు. బహిరంగ సభల్లో 200 మంది, ఏపీ న్యూస్, ఆంధ్రప్రదేశ్ ఏపీ న్యూస్, ఆంధ్రప్రదేశ్ ఇండోర్ ఈవెంట్లలో 100 మందికి మించి ఉండకూడదని, దేవాలయాల్లో భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా