నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణ అరెస్టు
11-05-202211-05-2022 08:39:55 IST
2022-05-11T03:09:55.697Z11-05-2022 2022-05-11T03:09:51.190Z - - 27-05-2022

పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ సూత్రధారి, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు మంగళవారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం చిత్తూరుకు తరలించి ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులే ప్రశ్నాపత్రాల లీకేజీ తీరును సాక్ష్యాధారాలతో వెల్లడించడంతో మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. నారాయణ విద్యా సంస్థలు కేంద్రంగానే రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలను లీక్ చేసినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో చిత్తూరు నుంచి వెళ్లిన పోలీసుల బృందం హైదరాబాద్‌లో నారాయణను అదుపులోకి తీసుకుంది. ఆయన భార్య రమాదేవికి 50 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. నారాయణను రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి తరలించగా ఆమె కూడా అదే వాహనంలో చిత్తూరు వచ్చారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నారాయణను అరెస్టు చేసినట్లు ప్రకటించిన పోలీసులు పరీక్షల మాల్‌ప్రాక్టీస్ యాక్ట్ 408, 409, 201, 120 (బి) ఐపీసీ, 65 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తమ విద్యా సంస్థల విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేసేందుకు నారాయణ ఎన్నో ఏళ్లుగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. తిరుపతి నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌రెడ్డి, డీన్ బాలగంగాధర్ నేరాన్ని అంగీకరించారు. ప్రశ్నాపత్రాలను లీక్ చేయాలని నారాయణ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. ఏటా పరీక్షలకు ముందు నారాయణ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రశ్నాపత్రం లీక్ చేసి తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేయాలని ఆదేశిస్తారని తెలిపారు. అందుకోసం విద్యా శాఖ కార్యాలయం నుంచి ఇన్విజిలేటర్లుగా నియమితులయ్యే ప్రభుత్వ ఉపాధ్యాయుల జాబితాను తెప్పించుకుంటారు. కొందరిని లంచాలు, బహుమతులతో ప్రలోభాలకు గురి చేసి వారి ద్వారా ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తారని పోలీసులు వివరించారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా