newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

ప్రభుత్వం పరిధిలోనే సినిమా టిక్కెట్లు అమ్మే విధానంతో ఎంతో మేలు..

14-09-202114-09-2021 21:30:22 IST
2021-09-14T16:00:22.178Z14-09-2021 2021-09-14T16:00:05.769Z - - 22-09-2021

ప్రభుత్వం పరిధిలోనే సినిమా టిక్కెట్లు అమ్మే విధానంతో ఎంతో మేలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకం జరిగితే సినీ పరిశ్రమకి ఎంతో మేలు జరుగుతుందని ఎపి మంత్రి పెర్ని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చెయ్యడం కోసమే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందన్నారు. కానీ దీనిపై కొందరు మేధావులు బయలుదేరారని, వారు దీని నేపథ్యం గమనించాలని సూచించారు. సినిమా టికెట్లను పారదర్శకంగా ప్రజలకు అందిస్తామన్నారు. నిబంధనలకు లోబడే షోలు ప్రదర్శించాలని చెప్పారు.

ఆన్‌లైన్‌లో ఏపీ ప్ర‌భుత్వం సినిమా టికెట్లు విక్ర‌యించాల‌ని అనుకోవ‌డంపై విప‌క్ష నేత‌లు అన‌వ‌స‌ర విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. అయితే సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ అంశంపై కమిటీలు వేశామని.. అధ్యయనం జరుగుతోందని మంత్రి చెప్పారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే టీడీపీ పనిగా పెట్టుకుందని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ప్రభుత్వం టిక్కెట్ల వ్యాపారం చేస్తుందని ప్రతిపక్షం నోటికొచ్చినట్లు మాట్లాడుతోంద‌ని మండిపడ్డారు. 

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకం జరగాలని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చెయ్యడం కోసమే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందన్నారు. మరో వైపు ఎపి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హీరో విశాల్ అభినందించడం విశేషం. ఈ నిర్ణయం వల్ల సినిమా కలెక్షన్ ల విషయంలో ఎలాంటి తేడా ఉండదని, అలాగే బ్లాక్ టికెట్ మార్కెట్ కి ఆస్కారం లేకుండా చేయవచ్చని, ఈ నిర్ణయం తీసుకున్న ఎపి ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. అయితే ఈ  నిర్ణయాన్ని ఖండిస్తున్నట్టు గానీ, అభినందిస్తున్నట్టు గానే ఇంతవరకూ టాలీవుడ్ ప్రముఖులు స్పందించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని సినీ పండితులు అంటున్నారు.

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

   10 hours ago


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

   11 hours ago


పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

   11 hours ago


బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

   a day ago


డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

   a day ago


అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

   21-09-2021


రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

   21-09-2021


చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

   20-09-2021


మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   20-09-2021


5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle