newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇప్ప‌టికైనా కాస్త ప‌నికొచ్చే ప‌నులు చేయాలి క‌దా జ‌గ‌న్ సార్

02-05-202102-05-2021 09:03:38 IST
Updated On 02-05-2021 09:39:39 ISTUpdated On 02-05-20212021-05-02T03:33:38.368Z02-05-2021 2021-05-02T03:31:43.833Z - 2021-05-02T04:09:39.328Z - 02-05-2021

ఇప్ప‌టికైనా కాస్త ప‌నికొచ్చే ప‌నులు చేయాలి క‌దా జ‌గ‌న్ సార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం జ‌గ‌న్ ప్లాన్స్ మామూలుగా ఉండ‌వు. ఏపీని ఎక్క‌డికో తీసుకెళ్లాల‌ని చూస్తారు. కానీ.. జ‌నాలే అక్క‌డికి రారు. అందుకే.. ఆయ‌నే ఇంటింటికీ ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంది అంటారు. తెలిసిందే క‌దా. ఏదైనా స‌రే.. ఇంటింటికీ అన‌డం జ‌గ‌న్ కి బాగా తెలిసిన ఎవ్వారం. ఎందుక‌య్యా ఇంటింటికీ రేష‌న్ అంటూ.. జ‌నాలే అంటున్నారు. అయినా స‌రే.. సీఎం జ‌గ‌న్ మాట అంటే మాటే.. ఇంటికొచ్చి ఇస్తాం అంటే.. ఇంటికొచ్చే ఇస్తాం అన్నారు. ఇలా ఇంకొన్ని ప‌నులు కూడా చ‌కా చ‌కా చేస్తున్నారు వాలంటీర్లు. మ‌రి వాలంటీర్ వ్య‌వ‌స్థ మామూలుగా ఉందా చెప్పండి. కాక‌పోతే.. ఆ వ్య‌వ‌స్థ‌ని ఎలా వాడుతున్నారు అనేదే కాస్త ప్రాబ్ల‌మ్.

అయితే.. ఇప్పుడు క‌దా అస‌లు సిస‌లు ఇంటింటి ప్రోగ్రామ్ పెట్టుకోవాల్సింది అంటున్నారు జ‌నాలు. క‌రోనా టైంలో.. టీకాలు ఇస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తే బెట‌ర్ క‌దా అంటున్నారు. ఎందుకంటే గ‌తంలో కూడా ఇంటింటికీ వెళ్లే టీకాలు వేస్తారు. చిన్న పిల్ల‌ల‌కి కూడా ఇలా ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తుంటారు. గ‌తంలో కూడా ఇలా చాలా టీకాలు వేశారు క‌దా. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేస్తే బావుంటుంది క‌దా అంటున్నారు జ‌నాలు. పైగా.. ఎలాగూ ఇంటింటి ప్రోగ్రామ్ ఏపీ స‌ర్కార్ కి అల‌వాటు అయిన ప‌నే. అంత‌కు మించి సెప‌రేట్ వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను కూడా క్రియేట్ చేసుకున్నారు జ‌గ‌న్. వారి స‌హ‌కారంతో.. ఆరోగ్య సిబ్బందిని తీసుకొచ్చి.. టీకాలు వేయ‌డం స్టార్ట్ చేస్తే.. ఈజీగా అయిపోతుంది క‌దా. వాలంటీర్ల స‌పోర్ట్ తో ఇద్ద‌రు ఆరోగ్య సిబ్బందిని గ్రామంలోకి తీసుకొస్తే.. ఒక్క రోజే స‌గం ఊరు క‌వ‌ర్ చేస్త‌రు కావ‌చ్చు అంటూ లెక్క‌లేస్తున్నారు.

మరోసారి ఆలోచించండి.. ఇంటర్ పరీక్షలపై సర్కారుకు హైకోర్టు సూచన

ఎంత క‌వ‌ర్ చేస్తారు అనేది వ‌దిలేస్తే.. అస‌లే కరోనా రెచ్చి పోతుంది. ఈ వ్యాక్సిన్ బుకింగ్ లు గ‌ట్రా గ్రామాల్లో జ‌నాల‌కి అర్దం అయి చావ‌వు. టీకా కేంద్రాల ద‌గ్గ‌రికి పోతేనేమో.. గుంపులు గుంపులుగా ఉంటున్నారు జ‌నాలు. మ‌ళ్లీ ఇంటికెళ్లి ఏం వ‌స్తాంలే.. ఇవ్వాళ వెళ్లి రేపు వ‌చ్చినా.. జ‌నాలు ఇలాగే ఉంటారులే. అయినా ఇవ్వాళే ప‌ని మునిగింది. రేపు మ‌ళ్లీ ప‌ని మునుగుతుందేమో అంటూ.. అదే గుంపులో క‌లిసి పోతున్నారు జ‌నాలు. సో.. వ్యాక్సిన్ కోసం వ‌చ్చిన వారికి కూడా క‌రోనా అంటుకున్న సంద‌ర్భాలు చూస్తున్నాం. అయినా.. ఇంటింటికీ వ్యాక్సిన్ వేస్తే.. రిస్క్ త‌క్కువే క‌దా. ఇదే డిమాండ్ జ‌నం నుంచి వ‌స్తోంది. మ‌రి ఏపీ స‌ర్కార్ దీనిపై ఆలోచిస్తుందో లేదో.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   an hour ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   3 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   9 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   9 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   7 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   10 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   6 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   11 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle