రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కరోనాను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు ఆలోచించాలి.. రెండు రోజులు సమయం కావాలి: జగన్
06-01-202206-01-2022 17:49:29 IST
2022-01-06T12:19:29.173Z06-01-2022 2022-01-06T12:19:26.898Z - - 27-06-2022

పీఆర్సీ సమస్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘాలు చర్చలు ప్రారంభించాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇప్పటికే 71 డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీసులిచ్చిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 13 యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో చర్చించినా పరిష్కారం దొరకలేదు. సీపీఎస్ పీఆర్సీ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులను పర్మినెంట్ చేయడంపై ప్రధానంగా ఉద్యోగుల సంఘాలు చర్చించే అవకాశం ఉంది. తమకు 55 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎస్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేయగా, సంఘాలు తిరస్కరించాయి. కరోనా పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 14.29 శాతానికి అంగీకరించాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా 55 శాతం ఫిట్‌మెంట్‌కే అంగీకరిస్తామని వారు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఉద్యోగులను కలవడం ఆసక్తికర అంశంగా మారింది. సమావేశంలో జగన్ కమిటీ సిఫారసు చేసిన 14.29 శాతం పెంచాల్సిందే అంటూ కమిటీ కూడా కొంచెం పెరగాలి అలాగే మీరు కూడా రాష్ట్ర ఆర్ధిక మరియు కరోనా నేపధ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మీరుకూడా కొంచెం తగ్గాలి అని సీఎం జగన్ ఉద్యోగులకు సానుకూలంగా మాట్లాడారు. పక్క రాష్ట్రం తెలంగాణాలో 30 శాతం ఇస్తున్నారని కొంతమంది సీఎం దృష్టికి తీసుకురాగా, ఆ రాష్ట్ర ఆదాయంతో పోలిస్తే మన ఆదాయం వేరని కాబట్టి ఆ రాష్ట్ర ఉద్యోగుల ఫిట్మెంట్ తో సరిపోల్చవద్దని ముఖ్యమంత్రి సున్నితంగా ఉద్యోగులకు తెలిపారు. చివరగా ఉద్యోగుల డిమాండ్లు అన్నీ విన్న ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ఆర్ధిక శాఖతో చర్చించి, రాష్ట్రానికి ఆర్ధికంగా భారంగా కాకుండా మరియు అలానే మీకు కూడా అన్యాయం జరగకుండా చూస్తానని, ఎక్కువ సమయం తీసుకోకుండా రెండు లేదా మూడు రోజుల్లో మంచి నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా