newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

22-09-202122-09-2021 08:37:33 IST
2021-09-22T03:07:33.384Z22-09-2021 2021-09-22T03:04:15.024Z - - 17-10-2021

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేనాని పవన్ కళ్యాణ్ పై  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకోవడం కోసం ఉద్యోగులు పోరాడుతున్న విషయం తెలిసిందే. దాదాపు 222 రోజులుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇన్నిరోజులుగా పోరాటం చేస్తున్న ఉద్యోగులపై పవన్ కళ్యాన్ దృష్టి పండింది. దీంతో విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తరుఫున పోరాడడానికి పవన్ రెడీ అయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక పార్టీ నడిపేందుకు ఖర్చుల కోసం అంటూ మళ్లీ సినిమాలు తీయడం మొదలుపెట్టాడు పవన్. ఇప్పుడు పార్టీని మొత్తం నంబర్ 2 నాదెండ్ల మనోహర్ చేతిలో పెట్టేసి పవన్ సినిమా రంగంలో బిజీ అయిపోయారు. తాజాగా అప్పుడప్పుడూ ఏపీకి వస్తూ అగ్గి రాజేస్తున్నారు.

అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి మద్దతు తెలుపడానికి వస్తుండగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాత్రం పవన్ పై నమ్మకం లేదంటూ ఘాటుగా స్పందించారు. ''222 రోజులుగా మహా ఉద్యమం జరుగుతుంటే మీకు ఇప్పటివరకు కనిపించలేదా? ఢిల్లీలో ఆందోళనకు వైసీపీ వచ్చింది కానీ మీరు రాలేదు.. మీకు ఢిల్లీలో పలుకుబడి ఉన్నట్టు ఎందుకు చెప్పలేకపోతున్నారని అక్కడకు వెళ్లి కాళ్లు పట్టుకొని ఇక్కడ మీసం తిప్పుతావా? ఇక్కడేమో బీజేపీతో గుద్దులాట.. అక్కడేమో ముద్దులాటనా? అని నారాయణ తీవ్ర విమర్శలు జనసేనానిపై చేశారు. మరి ఈ విమర్శలకి పవన్ కళ్యాణ్ ఎలా బడులిస్తాడో చూడాలని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల ఎజెండాపై సోనియా గాంధీకి నవజ్యోత్ సిద్ధూ లేఖ

వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల ఎజెండాపై సోనియా గాంధీకి నవజ్యోత్ సిద్ధూ లేఖ

   2 hours ago


సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల జమున

సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల జమున

   2 hours ago


టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

   6 hours ago


రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

   7 hours ago


పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

   16-10-2021


కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

   16-10-2021


మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

   15-10-2021


టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

   14-10-2021


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

   15-10-2021


మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

   14-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle