newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోవిడ్ పరీక్షలు ముమ్మరం... 24 గంటల్లోనే ఫలితం - ఆళ్ళ నాని

30-04-202130-04-2021 15:41:51 IST
Updated On 30-04-2021 15:43:43 ISTUpdated On 30-04-20212021-04-30T10:11:51.634Z30-04-2021 2021-04-30T09:03:26.955Z - 2021-04-30T10:13:43.711Z - 30-04-2021

కోవిడ్  పరీక్షలు ముమ్మరం... 24 గంటల్లోనే ఫలితం - ఆళ్ళ నాని
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్  పరీక్షల వేగాన్ని పెంచింది. ఈ లక్షణాలు ఉన్నవారు  రోజుల తరబడి నిరీక్షించాల్సి అవసరం లేకుండా సత్వర ప్రాతిపదికన నిర్ధారణ ఫలితాలను వెల్లడించబోతోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే కోవిడ్ నిర్ధారణ పరీక్షా ఫలితాలను వెల్లడించేందుకు చర్యలు తీసు కుంటున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని తెలిపారు. ఆసుపత్రులలోనే కాకుండా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా మని తెలిపారు. వైద్య ఆరోగ్య విభాగం కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తో కలసి మీడియా తో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో కోవిడ్  కేసుల పరిస్థితిని, ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ, నిరోధక చర్యలను వెల్లడించారు. రాష్ట్రంలో కోవిడ్  సోకిన వారికి చికిత్స చేసేందుకు అవసరమైన పరిమాణంలో ఆక్సిజన్ ను సమకూర్చుకుంటున్నామని అన్నారు. ఈ ఆక్సిజన్ నిరంతర సరఫరాను కొనసాగించేందుకు 30 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని తెలిపారు. కోవిడ్  చికిత్సకు వచ్చే వారినుంచి ఆసుపత్రులు భారీ మొత్తాన్ని వసూలు చేస్తున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందని, వాస్తవాలను తెలుసుకునేందుకు ఒక కమిటీని వేసే ఆలోచనను పరిశీలిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగినందున పరీక్షలను కూడా ముమ్మరం చేశామని వెల్లడించారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ బాధితులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వారికి వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ఆశా కార్యకర్తలు వీరికి తోడ్పాటును ఇస్తున్నారని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ మేరకు కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 104 సేవలను కూడా బలోపేతం చేస్తున్నామని, కేవలం మూడు రెంటాల వ్యవధిలోనే రోగులకు ఆసుపత్రిలో పడక సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే కోవిడ్  లక్షణాలు తక్కువస్థాయిలో ఉన్న వారికి కూడా ఎలాంటి జాప్యం లేకుండా వైద్య సేవలను అందిస్తున్నామని అన్నారు. ఇటు ఆసుపత్రి ఫీజులకు సంబంధించి కూడా ప్రభుత్వం గట్టి నియంత్రణ చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులలో మామూలు సేవలకు రోజుకు 3250 రూపాయలుగా నిర్ధారించమని, అలాగే తీవ్రంగా అస్వస్థతకు గురైన వారికి ఈ ఫీజును 16 వేల రూపాయలుగా నిర్దారించమని అన్నారు. ఇక రాష్ట్రంలో ఎక్కడా కూడా  వైద్య పరమైన ఉదాసీనకు తావులేకుండా చర్యలు చేపట్టామని, అన్ని చోట్లా సంరక్షణ సంఖ్యను భారీగా పెంచామని అన్నారు. ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో వేయి పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉందని అన్నారు.   

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   an hour ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   4 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   9 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   9 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   7 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   10 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   6 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   11 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle