newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

14-05-202114-05-2021 08:17:06 IST
2021-05-14T02:47:06.311Z14-05-2021 2021-05-14T02:39:42.333Z - - 22-06-2021

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ టీకాలను త్వరితగతిన పూర్తి చేస్తే కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా నిరోధించవచ్చునని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేసిన సందర్బంగా గురువారం మాట్లాడిన ఆయన దేశవ్యాప్తంగా 172 కోట్ల డోసులు అవసరమైతే కేవలం 18 కోట్ల డోసులనే ఇప్పటి వరకు ఉత్పత్తి చేశారని అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రతను అరికట్టడానికి ఏడు కోట్ల డోసులు అవసరమని, అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 73 లక్షల డోసుల టీకాలనే ఇచ్చిందని ఆయన తెలిపారు.   

భారత్ లో కేవలం రెండు సంస్థలే కోవిడ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్నాయని దేశంలో ఉన్న వ్యాక్సిన్ డిమాండ్ తో పోలిస్తే వీటి ఉత్పత్తులు ఎంత మాత్రం సరిపోవడం లేదని అన్నారు. భారత్ బయోటెక్ నెలకు కోటి వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నదని, సీరం సంస్థ నెలకు ఆరు కోట్ల డోసులను అందిస్తోందని తెలిపారు. దేశంలో కేవలం ఏడు కోట్ల వ్యాక్సిన్లను మాత్రమే ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉందని పేర్కొన్న జగన్, కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండక తప్పదని, సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే కోవిడ్ పై గట్టి పోరాటాన్ని నిబంధనలు, జాగ్రత్తలు పాటించడం ద్వారానే చేయగలుగుతామని స్పష్టం చేశారు.  

కోవిడ్ రోగుల చికిత్స కోసం తిరుమల తిరుపతి దేవస్థానం జర్మనీ టెక్నాలజీతో 22 షెడ్లను నిర్మించబోతోంది. ఇందుకోసం వెంకటేశ్వర సంక్షేమ నిధినుంచి  3.52 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఒక్కో షెడ్ లో 30 పడకలు ఉంటాయని, ఆక్సిజన్ సౌకర్యం కూడా కల్పిస్తామని టిటిడి ఎగ్జిక్యూటివ్ అధికారి తెలిపారు. ఈ షెడ్ల నిర్మాణం వల్ల కోవిడ్ రోగులకు ఆక్సిజన్ తో కూడిన పడకలు అందుబాటులోకి వస్తాయని, వత్తిడి కూడా తగ్గుతుందని తెలిపారు.

తిరుపతిలో స్విమ్స్ శ్రీ పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో ఈ రకమైన షెడ్లు ఏర్పాటు చేయడం వల్ల చికిత్సకు సంబంధించిన డిమాండ్ ను ప్రభుత్వం తట్టుకోగలిగింది. ఈ జర్మన్ షెడ్లకు విపరీతమైన డిమాండు ఉండటం వల్ల వీటిని నిర్మించాలని ఇతర జిల్లాల నుంచి కూడా టిటిడికి అభ్యర్ధనలు వస్తున్నాయి. ఆంద్ర ప్రదేశ్ అంతటా ఆక్సిజన్ పడకల కొరత ఉండటం వల్ల  జర్మన్ టెక్నాలజీతో ఈ రకమైన షెడ్లను నిర్మించడం వల్ల కోవిడ్ చికిత్సకు ఎంతో వీలు చేసినట్లు అవుతుందని అన్నారు. విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కాకినాడ, గుంటూరు లలో వెంటనే వీటి నిర్మాణం చేపడుతామని చెప్పారు. 

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఎంత మంది చనిపోయారో స్పష్టత ఇవ్వండి 

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

   37 minutes ago


ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

   4 hours ago


పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

   8 hours ago


సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

   11 hours ago


టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

   12 hours ago


బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు  శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

   a day ago


తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

   21-06-2021


ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

   21-06-2021


పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

   21-06-2021


హరీష్ రావు పై ప్రశంశల వర్షం

హరీష్ రావు పై ప్రశంశల వర్షం

   21-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle