newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

22-09-202122-09-2021 07:55:05 IST
2021-09-22T02:25:05.553Z22-09-2021 2021-09-22T02:25:01.938Z - - 17-10-2021

పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి విజయ దుందుభి మ్రోగించడంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసిపి పార్టీకి తిరుగు లేకుండా పోయింది. వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలపై ఎపి ప్రజలు సంతృప్తికరంగానే ఉన్నట్లు ఈ ఫలితాలు తెలుపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి మరీ తీసికట్టుగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు కంటే నందబూరి బాలకృష్ణ కాస్త బెటర్ అని అనుకొంటుండడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 

దేశంలోనే సీనియర్‌ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు కుప్పంలో కేవలం 3 ఎంపీటీసీ స్థానాలను మాత్రమే సాధించగా బాలకృష్ణ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో 7 ఎంపీటీసీలను గెలిపించుకున్నారు. పలువురు టీడీపీ నాయకులు ఇప్పుడు ఈ విషయం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. పలువురు ఇతర నాయకులు కూడా తమ నియోజకవర్గాల్లో చంద్రబాబుతో పోలిస్తే మెరుగైన ఫలితాలను సాధించినట్లు చర్చించుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 66 ఎంపీటీసీలకుగానూ ముచ్చటగా మూడు చోట్ల మాత్రమే టీడీపీని చంద్రబాబు గెలిపించగలిగారు. నాలుగు మండలాల్లో జెడ్పీటీసీ స్థానాల్లో ఓడిపోయారు. చివరికి చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలోనూ టీడీపీని గెలిపించలేక చేతులెత్తేశారు. 41 జెడ్పీటీసీలకు 482 చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు. గెలిచింది మాత్రం ఆరు జెడ్పీటీసీ స్థానాల్లోనే. అలాగే 6,558 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసి 930 చోట్ల నెగ్గారు. కుప్పంలో కూడా ఇంత దారుణంగా ఓడిపోవడం ఏమిటని టీడీపీ నాయకులు సైతం వాపోతున్నారు. దీంతో చంద్రబాబు పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల జమున

సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల జమున

   17 minutes ago


టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

   4 hours ago


రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

   5 hours ago


పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

   16-10-2021


కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

   16-10-2021


మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

   15-10-2021


టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

   14-10-2021


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

   15-10-2021


మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

   14-10-2021


నామినేషన్ ని ఉపసంహరించుకున్న ఈటల జమున.. ఆ ముగ్గురి నామినేషన్ చెల్లదు.

నామినేషన్ ని ఉపసంహరించుకున్న ఈటల జమున.. ఆ ముగ్గురి నామినేషన్ చెల్లదు.

   14-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle