newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

నామినేటెడ్ పోస్టులలో సామాజిక న్యాయం చూపిన వైఎస్ జగన్

17-07-202117-07-2021 19:30:17 IST
2021-07-17T14:00:17.070Z17-07-2021 2021-07-17T14:00:13.025Z - - 25-07-2021

నామినేటెడ్ పోస్టులలో సామాజిక న్యాయం చూపిన వైఎస్ జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత కొద్ది రోజుల క్రితమే ఎపి సిఎం వైఎస్ జగన్ నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన నామినేటెడ్ పోస్టులని శనివారం భర్తీ చేసారు. ఈ పోస్టులలో దాదాపు సామాజిక న్యాయం చేసారని వైఎస్ఆర్ సి నాయకులు చెబుతున్నారు. అయితే పోస్టులు ఆశించినప్పటికీ పోస్టులు దొరకని ఆశావహుల స్పందన ఎలా వుంటుందో చూడాలి. కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. వారి వివరాలు.. 

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషు, క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పాతపాటి సర్రాజు, కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్‌, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్‌, రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్‌గా చింతలచెరువు సత్యనారాయణరెడ్డి, ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎ.మల్లికార్జునరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డి, వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌గా ఖాదర్ బాషా, శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా బి. బీరేంద్రవర్మ, కాణిపాకం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డి ప్రమీలమ్మ, ఉమెన్స్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలినిరెడ్డి, గ్రీనింగ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నర్తు రామారావు, ఉపాధి కల్పన అభివృద్ధి సొసైటీ ఛైర్మన్‌గా శ్యాంప్రసాద్‌రెడ్డి, ఏపీ మారిటైం బోర్డ్‌ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి, ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా జమ్మన ప్రసన్నకుమార్‌, ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మొండితోక అరుణ్‌కుమార్‌, మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా షేక్‌ ఆసిఫ్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దవులూరి దొరబాబు, నాట్యకళ అకాడమీ ఛైర్మన్‌గా కుడుపూడి సత్య శైలజ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ ఛైర్‌పర్సన్‌గా టి.ప్రభావతి, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి, రూరల్‌ వాటర్‌ సప్లై సలహాదారుగా బొంతు రాజేశ్వరరావు, ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వంకా రవీంద్రనాథ్‌, కార్మిక సంక్షేమ బోర్డు వైస్‌ఛైర్మన్‌గా దాయల నవీన్‌బాబు, సాహిత్య అకాడమీ ఛైర్‌పర్సన్‌గా పిల్లిమొగ్గల శ్రీలక్ష్మి, 

రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కనుమూరి సుబ్బరాజు, కనీస వేతన సలహా బోర్డు ఛైర్‌పర్సన్‌గా బర్రి లీల, సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా సుస్మిత, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా పొనాక దేవసేన, రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మేరుగ మురళీధర్‌, సంగీత నృత్య అకాడమీ ఛైర్‌పర్సన్‌గా పొట్టెల శిరీష యాదవ్‌, ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌సోర్స్‌డ్‌ ఎంప్లాయిస్‌ ఛైర్మన్‌గా షేక్‌ సైదాని, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మెట్టుకూరు చిరంజీవిరెడ్డి, ఆగ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నవీన్‌ నిశ్చల్‌, ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా నదీం అహ్మద్‌, నాటక అకాడమీ ఛైర్మన్‌గా యెట్టి హరిత, APSRTC రీజనల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా ఎం.మంజుల (అనంతపురం), APSRTC రీజనల్‌ బోర్డ్‌ ఛైర్‌పర్సన్‌గా జి.బంగారమ్మ (విజయనగరం), APSRTC రీజనల్‌ బోర్డు ఛైర్మన్‌గా తాతినేని పద్మావతి (కృష్ణా), APSRTC రీజనల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానందరెడ్డి, APSRTC రీజనల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా బత్తుల సుప్రజ, విద్యాసంస్థలు, వసతుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మళ్ల విజయప్రసాద్‌, న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ (NEDCAP) ఛైర్మన్‌గా కె.కన్నప్పరాజు, క్రిస్టియన్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బొల్లవరపు జాన్‌వెస్లీ, బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా సీతంరాజు సుధాకర్‌, సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడి ప్రభాకర్‌రావు, రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా షమీమ్‌ అస్లామ్‌, ఫోక్‌ అండ్‌ క్రియేటివిటీ అకాడమీ ఛైర్మన్‌గా కొండవీటి నాగభూషణం, లెదర్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కాకుమాను రాజశేఖర్‌, సొసైటీ ఫర్‌ ఆంధ్రప్రదేశ్‌ నెట్‌వర్క్‌(SAPNET) ఛైర్మన్‌గా బాచిన కృష్ణచైతన్య, రాష్ట్ర టైలర్‌ డెవలప్‌మెంట్‌ కోపరేటివ్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌గా షేక్‌ సుభాషిణి, 

రాష్ట్ర పర్యావరణ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా గుబ్బ చంద్రశేఖర్‌, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఆరెమండ వరప్రసాద్‌రెడ్డి, హ్యాండిక్యాప్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ముంతాజ్‌ పఠాన్‌, షేక్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా షేక్‌ ఆషా బేగం, హిస్టరీ అకాడమీ ఛైర్మన్‌గా కుర్రా నాగమల్లేశ్వరి, గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌గా మందపాటి శేషగిరిరావు, స్పోర్ట్‌ అథారిటీ ఛైర్మన్‌గా బైరెడ్డి సిద్దార్థరెడ్డి, ఏపీ ఖాదీ మరియు విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా పెర్లప్పగారి భాగ్యమ్మ, మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా పమిరెడ్డిగారి పెద్దనాగిరెడ్డి, ఏపీ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కర్ర గిరిజ, ఏపీ మీట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మాదిగ శ్రీరాములు, ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్ ఛైర్మన్‌గా షేక్‌ గౌసియా బేగం, రాష్ట్ర వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కరీముల్లా షేక్‌ అమీన్‌, APCOB ఛైర్మన్‌గా మల్లెల ఝాన్సీరెడ్డి, హ్యండ్‌క్రాఫ్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బడిగించల విజయలక్ష్మి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డ్‌ ఛైర్మన్‌గా పులి సునీల్‌కుమార్‌, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కోడూరు అజయ్‌రెడ్డి, రాష్ట్ర హజ్‌ కమిటీ ఛైర్మన్‌గా బద్వేల్‌ షేక్‌ గౌస్‌ లాజమ్‌, అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా వి.లీలావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా సువ్వారి సువర్ణ (శ్రీకాకుళం), అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కోరాడ ఆశాలత (శ్రీకాకుళం), కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం), డీసీసీబీ ఛైర్మన్‌గా కరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం), 

జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రెడ్డి పద్మావతి (విజయనగరం), బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్‌పర్సన్‌గా పార్వతి, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా అవనాపు భావన (విజయనగరం), డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కల నాయుడుబాబు (విజయనగరం), VKPCPIR ఛైర్మన్‌గా చొక్కాకుల లక్ష్మి (విశాఖ), VMRDA ఛైర్మన్‌గా అక్రమాని విజయనిర్మల (విశాఖ), విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా జి.వెంకటేశ్వరరావు (విశాఖ), జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా కొండా రమాదేవి (విశాఖ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా పళ్ల చిన్నతల్లి (విశాఖ), జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా సీహెచ్‌.అనిత (విశాఖ), రాజమండ్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.షర్మిలారెడ్డి, రాజమండ్రి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా చందన నగేష్‌, కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా రాజబాబు యాదవ్‌, హితకారిణి సమాజం ఛైర్మన్‌గా మునికుమారి (తూ.గో), ఏలేశ్వరం డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా తోలాడ శైలజ పార్వతి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా దూలం పద్మ (తూ.గో), కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా రాగిరెడ్డి దీప్తి, సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా మణికుమారి (తూ.గో), రాజమండ్రి అర్బన్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా గిరిజాల తులసి, ఈస్టర్న్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా ఏడిద చక్రపాణిరావు (తూ.గో), సహకార సెంట్రల్‌ బ్యాంక్ ‌ఛైర్మన్‌గా ఆకుల వీర్రాజు (తూ.గో), సెంట్రల్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా కుడుపూడి వెంకటేశ్వర్ (తూ.గో), ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.ఈశ్వరి, ఏలూరు స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బొడ్డాని అఖిల, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా చిర్ల పద్మశ్రీ (ప.గో), వెస్టర్న్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా గంజిమాల దేవి (ప.గో), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా వేండ్ర వెంకటస్వామి (ప.గో), 

జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా పీవీఎల్‌ నరసింహరావు (ప.గో), జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా తిప్పరమల్లి పూర్ణమ్మ (కృష్ణా), కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా పడమట స్నిగ్ధ (కృష్ణా), అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా భవాని (కృష్ణా), సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా తన్నేరు నాగేశ్వరరావు (కృష్ణా), జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా బత్తుల దేవానంద్‌ (గుంటూరు), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా వై.భాగ్యలక్ష్మి (గుంటూరు), జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్ ఛైర్మన్‌గా సీతారామాంజనేయులు (గుంటూరు), ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎస్‌.మీనాకుమారి (ప్రకాశం), జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రాచగొర్ల వెంకట సుశీల (ప్రకాశం), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా రావి పద్మావతి (ప్రకాశం), జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా మాదాశి వెంకయ్య (ప్రకాశం), నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.ద్వారకానాథ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా డి.శారద (నెల్లూరు), జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి (నెల్లూరు), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా వి.చలపతి (నెల్లూరు), తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నారమల్లి పద్మజ, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా సామకోటి నాగలక్ష్మి (చిత్తూరు), జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌(DCCB) ఛైర్మన్‌గా ఎం.రెడ్డమ్మ (చిత్తూరు), జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నైనార్‌ మధుబాల (చిత్తూరు), పలమనేరు-కుప్పం-మదనపల్లి అర్బన్‌ డెవలప్‌మెంట్‌  ఛైర్మన్‌గా వెంకట్‌రెడ్డి యాదవ్‌, కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌ (కర్నూలు), జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా సన్నాల మహలక్ష్మి (కర్నూలు), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా చెంచన్నగారి శిరోమణి (కర్నూలు), AHUDA ఛైర్మన్‌గా మహాలక్ష్మి శ్రీనివాసులు (అనంతపురం), 

జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా లోమాడ ఉమాదేవి (అనంతపురం), పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా లక్ష్మీనరసింహ, జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా మానుకింద లిఖిత (అనంతపురం), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా టి.చంద్రశేఖర్‌రెడ్డి (అనంతపురం), జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా ఎల్‌.ఉషారాణి (వైఎస్‌ఆర్‌ జిల్లా), అన్నమయ్య అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా గురుమోహన్‌, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా చంద్రలీల (వైఎస్‌ఆర్‌ జిల్లా) ఉన్నారు. మొత్తానికి నామినేటెడ్ పోస్టులని ఎపి ప్రభుత్వం భర్తీ చేసింది. అయితే పోస్టులు రాని ఆశావహుల స్పందన ఎలా వుంటుందో అన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంది.  

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   5 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   11 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   11 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   12 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   24-07-2021


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle