newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు.. అనుకున్న‌ట్లే లాక్ డౌన్ ఫిక్స్

04-05-202104-05-2021 20:33:18 IST
Updated On 04-05-2021 20:36:41 ISTUpdated On 04-05-20212021-05-04T15:03:18.340Z04-05-2021 2021-05-04T15:03:12.940Z - 2021-05-04T15:06:41.056Z - 04-05-2021

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు.. అనుకున్న‌ట్లే లాక్ డౌన్ ఫిక్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రోజులు ఎట్టా త‌గ‌ల‌డ్డ‌యో చూస్తూనే ఉన్నం క‌దా. ఈ టైంలో కేబినెట్ భేటీ అంటే ఊరికే ఉంటుందా. మంత్రి వ‌ర్గం మీటింగ్ లో ఏం చర్చించుకున్నారు.. ఏ నిర్ణ‌యాలు తీసుకున్నారు అంటూ.. ఎన్నో ఇంట్ర‌స్టింగ్ పాయింట్స్ పై అంచ‌నాలు పెంచేసుకుంటం. మంత్రి వ‌ర్గం మీట్ అయింది అంటే.. ఇప్పుడు ముఖ్యంగా లాక్ డౌన్ పైనే క‌దా థింక్ చేస్తాం.

అనుకున్న‌ట్లే.. మంత్రి వ‌ర్గంలో కూడా క‌రోనా కోర‌లు చాచి జ‌నం పై ప‌డుతున్న విష‌యంతో పాటు.. లాక్ డౌన్ గురించి చ‌ర్చ‌కు వ‌చ్చింది నిర్ణ‌యాలు కూడా తీసేసుకున్నారు. రెండు రోజులుగా మ‌ధ్యాహ్నం నుంచి లాక్ డౌన్ అనుకుంటున్నాం క‌దా. అది ఫిక్స్ చేసింది ఏపీ ప్ర‌భుత్వం. రేప‌టి నుంచి మ‌ధ్యాహ్నం దాకానే హ‌డావిడి. 12 గంట‌లు కాగానే.. అంద‌రూ ఎక్క‌డి వాళ్లు అక్క‌డ్నే గ‌ప్ చుప్ సాంబార్ బుడ్డి అన్న‌ట్లు లాక్ అయిపోవాలి. లేదు.. నేను స్వేచ్ఛా జీవిని.. స్వ‌చ్ఛ‌మైన గాలి పీలుస్తా అంటూ బ‌య‌టికొస్తే మాత్రం న‌డ‌వ‌దు. స్వ‌చ్ఛ‌మైన గాలిలో ఏం క‌లిసిందో తెలిసిందే క‌దా. క‌రోనా క‌లిసిన గాలి పీలిస్తే.. బొంద‌ల గ‌డ్డ‌ల బెర్త్ క‌న్ఫామ్ చేసుకోవాల్సిందే. సో.. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి.. మ‌ళ్లీ తెల్లారిందాక క‌ర్ఫ్యూ నడుస్తుంది.

బ‌స్సులు ప‌బ్లిక్ ర‌వాణా విష‌యంలో కూడా అంతే. మేం ముందే బ‌య‌ల్దేరాం. ఇంటికి చేరాలా లేదా అంటే నడ్వ‌దీ. 12 గంట‌లు కాగానే.. ఎక్క‌డిక‌క్క‌డే ఆగిపోవాల్సిందే. ఎందుకంటే.. దూర ప్రాంతాల నుంచి వ‌చ్చే బ‌స్సులను.. 12 గంట‌ల త‌ర్వాత తిర‌గ‌నివ్వ‌రు. సాయం కాలం అయింది.. ఇప్ప‌టి దాకా ఉక్క పోత‌కి చ‌చ్చా.. ఈ చ‌ల్ల‌ని పిల్ల గాలులు వ‌చ్చే టైంలో.. ఓ పెగ్గేస్తం అంటే నడ్వ‌దీ. అట్టా ఎయ్యాలంటే ముందే తెచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే.. 12 త‌ర్వాత మందు కూడా దొర‌క‌దు. ఎంత ఎమ‌ర్జెన్సీ అయినా స‌రే.. లిక్క‌ర్ స‌ర‌ఫ‌రా చేయ‌బ‌డ‌దు. స‌రెనా. ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా పై కూడా ఫోక‌స్ చేసింది స‌ర్కార్.. బ‌య‌టి రాష్ట్రాల నుంచి తెచ్చి.. ఆక్సిజ‌న్ నిల్వ‌చేస్తార‌ట‌. 

అలాగే మిగ‌తా  విష‌యాలు చూస్తే.. బీసీ రిజ‌ర్వేష‌న్లు మ‌రో ప‌దేళ్లు పెంచుతూ కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. ఈనెల 13న రైతు భ‌రోసా డ‌బ్బులు జ‌మ చేస్తార‌ట‌. 25 లక్ష‌ల మంది రైతుల‌కి పైగానే.. 2 వేల 8 వంద‌ల 5 రూపాయ‌లు జ‌మ అవుతాయ‌ట‌.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   30 minutes ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   3 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   8 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   8 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   7 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   9 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   5 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   10 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle