newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

ఫౌచీ ఒక ఇడియట్‌.. నోరు పారేసుకున్న ట్రంప్

21-10-202021-10-2020 11:45:11 IST
2020-10-21T06:15:11.809Z21-10-2020 2020-10-21T06:15:09.341Z - - 02-12-2020

ఫౌచీ ఒక ఇడియట్‌.. నోరు పారేసుకున్న ట్రంప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సుప్రసిద్ధ అమెరికన్ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ పౌచీపై కనీస సభ్యత కూడా లేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఫౌచీ, ఇతర ఆరోగ్య నిపుణులపై ట్రంప్ నోరు పారేసుకున్నారు. కరోనా గురించి వారు చెప్పిన మాటలు విని విని అమెరికన్లు అందరూ అలసిపోయారని అన్నారు. కరోనా అంశంలో ఫౌచీ చెప్పిన సూచనలు తమ ప్రభుత్వం పాటించి ఉంటే 5 లక్షల మందికి పైగానే ప్రాణాలు కోల్పోయేవారని అన్నారు. 

నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కరోనా కట్టడి అనేది ప్రధాన అంశంగా మారింది. ప్రభుత్వంలోని ఆరోగ్య నిపుణులు కరోనాని ఎదుర్కోవడంలో తీవ్రంగా విఫలమయ్యారంటూ డెమొక్రాట్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాస్‌వేగాస్‌లోని ఎన్నికల ప్రచారంలో ఆంటోని ఫౌచీ, ఇతర నిపుణులపై నోరు పారేసుకున్నారు. ‘కోవిడ్‌ సంక్షోభంతో అమెరికన్లు అలసిపోయారు. జరిగిందేదో జరిగింది మమ్మల్ని ఒంటరిగా వదిలేయండని వారు వేడుకుంటున్నారు. ఫౌచీ ఒక ఇడియట్‌’ అని ట్రంప్‌ దుయ్యబట్టారు. 

ఆయన మన మధ్య 35 ఏళ్లుగా ఉంటున్నారని, కరోనాని ఎదుర్కోవడంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 1984 నుంచి ఫౌచీ అమెరికా అంటువ్యాధి నిపుణుడిగా వ్యవహరిస్తున్నారు. ఫౌచీపై మాటల తూటాలు విసిరిన ట్రంప్‌ అవి తనకెక్కడ నెగెటివ్‌గా మారతాయేమోనని భావించారు. ఫౌచీని ఏమైనా అంటే అవి తనకే ఎదురు తిరుగుతాయన్న ట్రంప్‌.. ఫౌచీ మంచి వ్యక్తి అంటూ తిట్టిన నోటితోనే ప్రశంసల వర్షం కురిపించారు. 

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే చర్చా కార్యక్రమంలో కొత్త నిబంధనలు ఏర్పాటయ్యాయి. ఈ నిబంధనల్లో భాగంగా చర్చలో పాల్గొనే అభ్యర్థులు ఒకరికొకరు వాదనలో అడ్డుపడకుండా ఉండేందుకు వారివారి మైక్రోఫోనులను రెండు నిమిషాలు మ్యూట్‌ చేయడం జరుగుతుందని ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ కమీషన్‌ తెలిపింది. ఈ రెండు నిమిషాలు ప్రత్యర్థి మైకు మ్యూట్‌లో ఉంచుతారు. దీంతో ప్రతి అభ్యర్థి తాను చెప్పదలచిన విషయాన్ని  అడ్డులేకుండా చెప్పే వీలుంటుంది. ఆపై సదరు విషయానికి సంబంధించి డిబేట్‌ కొనసాగుతుంది. రెండు పార్టీలు ఇందుకు అంగీకరించాయని కమిషన్‌ తెలిపింది.  

కోవిడ్ 19 వైరస్ యూరప్‌తో పాటు పలు అమెరికా రాష్ట్రాల్లో మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో కనీసం మాస్కులు వాడకుండా, భౌతిక దూరం పాటించకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ట్రంప్ మరోవైపున అమెరికాలో వైరస్ విధ్వంసానికి కారకులు పౌచీలాంటివాళ్లేనని విరుచుకుపడటం గమనార్హం. అయితే వైరస్ నిరోధక చర్యలపై ట్రంప్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణులను ఆంటోనీ పౌచీ తొలినుంచి వ్యతిరేకిస్తున్నారు. 

అమెరికా అధ్యక్షుడి అహంభావ పూరితమైన విధానాల వల్లే ఇప్పటిదాకా అమెరికాలో 2 లక్షల మందిపైగా కరోనా వైరస్ బారిన పడి మృతిచెందారని, పౌచీ సూచనలను ట్రంప్ ప్రభుత్వం పాటించకపోవడమే దీనికి కారణమని ప్రముఖ ఆరోగ్య నిపుణుడు, హార్వార్డ్ మెడికల్ స్కూల్ మాజీ ప్రొఫెసర్ విలియం హజెల్టైన్ విమర్శించారు.

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు చేస్తున్నది ఎలా ఉందంటే ఇల్లు కాలుతుండగా దాన్ని ఆర్పుతున్న అగ్నిమాపక దళంపై దాడి చేసినట్లుందని విలియం ఎద్దేవా చేశారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle