newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన

14-10-202114-10-2021 07:52:58 IST
2021-10-14T02:22:58.893Z14-10-2021 2021-10-14T02:22:53.097Z - - 17-10-2021

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) బాలీవుడ్ నటుడు షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ని అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే.. కేసు తదుపరి విచారణ జరిగే వరకు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత ప్రయత్నించినా బెయిల్ దొరకకుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక తన కొడుకుకు బెయిల్ రాకపోవటంతో గౌరీఖాన్ శోక సముద్రం లో మునిగి పోయిందని తెలుస్తోంది. షారూక్ ఖాన్ సైతం భోజనం చెయ్యటం లేదని, నిద్రపోవటం లేదని సమాచారం. ఇక జైలులో ఉన్న ఆర్యన్ సైతం జైలుకు వెళ్లిన దగ్గరి నుండి  భోజనం చేయలేదని జైలు క్యాంటిన్‌లో కొనుకున్న పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్లతోనే ఆకలి తీర్చుకుంటున్నాడట. ఇంటి నుంచి తీసుకొచ్చిన వాటిర్ బాటిల్స్‌లోని నీటినే పొదుపుగా వాడుకుంటూ తాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్యన్ చాలా నీరసించి పోయాడని, ఆర్యన్ ఆరోగ్య పరిస్థితి పై పోలీసులు సైతం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

కేరళలో భారీ వర్షాలు... కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి

కేరళలో భారీ వర్షాలు... కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి

   an hour ago


బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ వేడుకలలో హింస.. 3 మృతి, 60 మంది గాయాలు

బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ వేడుకలలో హింస.. 3 మృతి, 60 మంది గాయాలు

   15-10-2021


J&K లో కౌంటర్-టెర్రర్ ఎటాక్ లో ఆర్మీ ఆఫీసర్, సైనికుడు మరణించారు

J&K లో కౌంటర్-టెర్రర్ ఎటాక్ లో ఆర్మీ ఆఫీసర్, సైనికుడు మరణించారు

   15-10-2021


ఆ మూడు రాష్ట్రాల సరిహద్దులు 50 కి.మీ.ల మేర BSF పరిధిలోకి...

ఆ మూడు రాష్ట్రాల సరిహద్దులు 50 కి.మీ.ల మేర BSF పరిధిలోకి...

   14-10-2021


ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదానికి మూలంగా మారకుండా నిరోధించండి: G20 సమావేశంలో ప్రధాని మోడీ

ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదానికి మూలంగా మారకుండా నిరోధించండి: G20 సమావేశంలో ప్రధాని మోడీ

   13-10-2021


దేశంలో బొగ్గు సంక్షోభం.. రాష్ట్రాల నుంచి లేఖలు

దేశంలో బొగ్గు సంక్షోభం.. రాష్ట్రాల నుంచి లేఖలు

   12-10-2021


రానున్న రోజుల్లో చీకటిలోకి ఇండియా..

రానున్న రోజుల్లో చీకటిలోకి ఇండియా..

   12-10-2021


ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి

ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి

   11-10-2021


జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ ఆఫీసర్, 4 మంది సైనికులు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ ఆఫీసర్, 4 మంది సైనికులు మరణించారు

   11-10-2021


ఎయిర్ ఇండియా ని టాటా సన్స్ 18,000 కోట్లకు గెలుచుకుంది

ఎయిర్ ఇండియా ని టాటా సన్స్ 18,000 కోట్లకు గెలుచుకుంది

   08-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle