newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అన్ని సార్లూ హీరోలు కాలేరు.. క‌లెక్ట‌ర్ సార్

04-05-202104-05-2021 21:21:34 IST
2021-05-04T15:51:34.955Z04-05-2021 2021-05-04T15:49:10.561Z - - 14-05-2021

అన్ని సార్లూ హీరోలు కాలేరు.. క‌లెక్ట‌ర్ సార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఎహే.. ఎన్నేళ్లు నిరీక్ష‌ణ‌లు.. ఆడిష‌న్లు.. ఆట్లు పాట్లు ఇవ‌న్నీ అవ‌స‌రమా. ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోవాలి. అగ్రెసివ్ గా ముందుకెళ్లాలి. కోడితే.. దేశం మొత్తం మ‌నం మీడియాలో క‌నిపించాలి. సోష‌ల్ మీడియాలో మ‌న‌మే ట్రెండింగ్ లో ఉండాలి. ఇలాంటి కోరిక‌లు చాలా మందికే ఉంట‌య్. ముఖ్యంగా ఐఏఎస్ లు ఐపీఎస్ ల‌కు కాస్త ఎక్కువే అనొచ్చు. వారి చేతిలో ఉండే ప‌వ‌ర్స్ గురించి వారికి తెలుసు కాబ‌ట్టి.. లెక్క చేయ‌రు. అబ్య‌స్లీ అది నిజ‌మే. వారి చేతిలో అంత ప‌వ‌ర్ ఉంటుంది.

కానీ... స‌ర్కార్ చేతిలో  ప‌ని చేసే వారిమే అని వారు గుర్తించాలి. ప్ర‌జా స్వామ్యం ప్ర‌కార‌మే న‌డుచుకోవాలి అని వారు గుర్తించాలి. కొన్ని కొన్ని సార్లు.. మంచికే చేసినా.. చెడుగా ఎదురొస్తుంది అని గుర్తుంచుకోవాలి. మ‌నం ఎంత సామాజిక దృక్ప‌థంతో చేసినా.. జ‌నం అర్దం చేసుకోర‌ని.. ప్ర‌భుత్వాలు ఒప్పుకోవ‌ని గుర్తించాలి.. గుర్తుంచుకోవాలి. కానీ.. త్రిపుర‌లో ఓ క‌లెక్ట‌ర్ మాత్రం ఈ మ‌ధ్య బాగా హ‌డావిడి చేశారు. చివ‌రికి ఎవ్వారం అంతా అడ్డం తిరిగింది.

రాత్రి టైంలో ఓ పెళ్లి ఫంక్ష‌న్ లోకి ఎంట‌ర్ అయ్యారు క‌లెక్ట‌ర్. మ‌రి ఇన్ఫ‌ర్మేష‌న్ తో వ‌చ్చారో.. అటుగా వెళ్తూ.. కోపం వ‌చ్చి ఎంట‌ర్ అయ్యారో తెలీదు కానీ.. నానా ర‌చ్చా చేశారు. పెళ్లి వేడుక‌లో రౌడీలు భ‌య‌పెట్టిన‌ట్లు భ‌య‌పెట్టారు. సామాన్లు ప‌డేశారు. మండ‌పాలు పీకేశారు. కుర్చీలు విసిరేశారు. పెళ్లి కొడుకుని కొట్టారు. పెళ్లి కూతుర్ని భ‌య‌పెట్టారు. క‌లెక్ట‌ర్ అగ్రెసివ్ గా మూవ్ అయ్యారు. అదేనండీ.. మ‌న తెలుగు సినిమాల్లో హీరోల్లాగా.. ఇక పోతే విలన్స్ లా  కూడా. ఇలా దుమ్ములేపారంటే న‌మ్మండి. ఎందుకు సామీ అంత ర‌చ్చ చేస్తున్నారు అని ఎవ‌రూ అడ‌గ‌లేదు. ఎందుకంటే క‌రోనా టైం క‌దా. పెళ్లి ఫంక్ష‌న్స్ కి కాస్త ఎక్కువ రూల్స్ ఉన్న‌య్ అని తెలుసు క‌దా. అయితే.. ఆ పెళ్లి వాళ్లు ముందే ప‌ర్మిష‌న్ తీసుకున్నార‌ట‌. కానీ.. క‌లెక్ట‌ర్ ఏమో.. వీరంగం వేశారు. చివ‌రికి ఆ వీడియో వైర‌ల్ అయింది. క‌లెక్ట‌ర్ హీరో అయ్యారు. ఇట్టా ఉండాలిరా ఆఫీస‌ర్ అంటే.. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. అదే టైంలో ట్రోలింగ్ కూడా త‌ప్ప‌లేదు. మ‌రీ ఇంత ఓవ‌రాక్ష‌న్ అవ‌స‌ర‌మా అంటూ.. నానా మాట‌లూ అంటూ పోస్ట్ లు పెట్టిన వారు కూడా ఉన్నారు. ఫైన‌ల్ గా త్రిపుర గ‌వ‌ర్న‌మెంట్ క‌లెక్ట‌ర్ పై చ‌ర్య‌లు తీసుకుంది. ప్ర‌స్తుతానికి అయితే విధుల నుంచి కూడా తొల‌గించార‌ట‌. విచార‌ణ‌కు  కూడా ఆదేశించార‌ట‌. కానీ.. క‌లెక్ట‌ర్ ఏమో.. నేను ఎవ‌రినీ బాధ పెట్ట‌డానికి అలా చేయ‌లేదు. వారి మంచి కోస‌మే చేశా.. బ‌య‌ట క‌రోనా ఎలా ఉందో చూస్తున్నాం క‌దా అంటున్నారు.

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   2 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   10 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   11 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   21 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle