newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

శశికళ కి దెబ్బ మీద దెబ్బ.. వంద కోట్ల ఆస్తులు సీజ్‌

10-09-202110-09-2021 09:28:50 IST
Updated On 10-09-2021 10:27:53 ISTUpdated On 10-09-20212021-09-10T03:58:50.829Z10-09-2021 2021-09-10T03:53:28.796Z - 2021-09-10T04:57:53.107Z - 10-09-2021

శశికళ కి దెబ్బ మీద దెబ్బ.. వంద కోట్ల ఆస్తులు సీజ్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమిళనాడు రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన శశికళ కి ప్రస్తుతం గడ్డు పరిస్థితి వచ్చింది.  మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి, అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆమెకు సంబంధించిన వంద కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను విభాగం జప్తు చేసింది. బినామీ లావాదేవీల చట్టం కింద  ఆమెకు సంబంధించిన 11 ఆస్తిపాస్తులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

 

శ‌శిక‌ళ‌కు చెందిన ఆస్తుల‌ను ఆదాయ ప‌న్ను శాఖ బుధ‌వారం బినామీ లావాదేవీల నిషేధిత చ‌ట్టం కింద‌ అటాచ్ చేసింది. చెన్నై శివార్ల‌లోని ప‌య్య‌నుర్ గ్రామంలోని ఆస్తుల‌ను ఐటీ అధికారులు అటాచ్ చేశారు. కాగా గ‌త ఏడాది శ‌శిక‌ళ‌, ఆమె స‌న్నిహితుల‌కు చెందిన చెన్నైలోని దాదాపు 65 ప్రాప‌ర్టీల‌ను ఐటీ శాఖ అటాచ్ చేసింది.. రూ.100 కోట్ల విలువైన భూమిని అటాచ్‌ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చిన్నమ్మకు ఐటీ శాఖ వరుసగా షాక్‌లు ఇస్తోంది కొద్దిరోజుల క్రితమే ఆమెకు పన్ను మినహాయింపు వర్తించదని ఝలక్‌ ఇచ్చింది. తాజాగా ఐటీ డిపాజిట్ ఆస్తుల నిరోధక చట్టం కింద శశికళ ఆస్తులను జప్తు చేశామని వెల్లడించారు. ఇప్పటికే శశికళకు చెందిన రూ.2000 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ ఇప్పటికే జప్తు చేసింది. జైలు శిక్ష పడిన వ్యక్తికి ఐటీ బకాయిల్లో మినహాయింపు వర్తించదని ఐటీ వర్గాలు కోర్టుకు స్పష్టం చేశాయి. 

 

2008లో ఏసీబీ సమర్పించిన నివేదిక మేరకు ఆస్తులకు సంబంధించి రూ. 48 లక్షలు పన్ను చెల్లించాలని ఐటీ వర్గాలు చిన్నమ్మను ఆదేశించాయి. దీనిని వ్యతిరేకిస్తూ ఐటీ ట్రిబ్యునల్‌ను శశికళ ఆశ్రయించారు. ఆ పన్ను చెల్లింపు నుంచి గట్టెక్కారు. చెన్నెలో శశికళకు సంబంధించిన 65 ఆస్తులను గతేడాది ఐటీ అటాచ్‌ చేసింది. 2019లో రూ.1,600 కోట్ల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2017లో 187 ఆస్తులపై తనిఖీలు జరిగాయి. రూ.1,430 కోట్ల పన్ను చెల్లించలేదని శశికళపై అభియోగాలు ఉన్నాయి. 1991 జూలై నుంచి ఏప్రిల్‌ 1996 వరకు శశికళ బంధువు ఇళవరసి, వీఎన్‌ సుధాకరన్‌ పేర్ల భారీగా ఆస్తుల కొనుగోళ్లు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. 66 ఏళ్ల శశికళ 2017 ఫిబ్రవరిలో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలు నుంచి శశికళ విడుదలవడంతో తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్రమాస్తుల కేసులో ఇంకా ఆమెపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని అందరూ ఊహించగా అనూహ్యంగా ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆమె మళ్లీ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది.

రాష్ట్రాలు ప్రతి కోవిడ్ మరణానికి ₹ 50,000 పరిహారం అందిస్తాయి.. షరతులు ఇవే: కేంద్రం

రాష్ట్రాలు ప్రతి కోవిడ్ మరణానికి ₹ 50,000 పరిహారం అందిస్తాయి.. షరతులు ఇవే: కేంద్రం

   2 hours ago


ఇండియా కరోనా టీకా సర్టిఫికేట్ పై మాకు నమ్మకం లేదు: బ్రిటన్

ఇండియా కరోనా టీకా సర్టిఫికేట్ పై మాకు నమ్మకం లేదు: బ్రిటన్

   6 hours ago


కోవిషీల్డ్ మాత్రమే WHO ఆమోదించింది..  కోవాక్సిన్, స్పుత్నిక్ WHO ఆమోదం లేదు

కోవిషీల్డ్ మాత్రమే WHO ఆమోదించింది.. కోవాక్సిన్, స్పుత్నిక్ WHO ఆమోదం లేదు

   21-09-2021


NDA మహిళా క్యాడెట్‌ల కోసం సన్నద్ధమవుతోంది, మే నుండి పరీక్షలు: కేంద్రం

NDA మహిళా క్యాడెట్‌ల కోసం సన్నద్ధమవుతోంది, మే నుండి పరీక్షలు: కేంద్రం

   21-09-2021


అవినీతి ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న అమెజాన్ సంస్థ.. దర్యాప్తు ప్రారంభం

అవినీతి ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న అమెజాన్ సంస్థ.. దర్యాప్తు ప్రారంభం

   21-09-2021


రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

   21-09-2021


ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

   19-09-2021


సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

   18-09-2021


గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

   18-09-2021


ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

   18-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle