newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

సాయిబాబాకు మందులు, పుస్తకాలు కూడా ఇవ్వరా.. హరగోపాల్

21-10-202021-10-2020 13:25:18 IST
2020-10-21T07:55:18.781Z21-10-2020 2020-10-21T07:55:15.586Z - - 02-12-2020

సాయిబాబాకు మందులు, పుస్తకాలు కూడా ఇవ్వరా.. హరగోపాల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దాదాపు 90 శాతం వైకల్యంతో ఇబ్బందిపడుతూ జైలు జీవితం గడుపుతున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ అధ్యాపకుడు డాక్టర్‌.జి.ఎన్‌. సాయిబాబాకు అత్యవసరమైన మందులు, పుస్తకాలు, ఉత్తరాలు కూడా అందించకుండా నెలల తరబడి వేధించడం ఖైదీల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని పౌర హక్కుల నేత  ‘కమిటీ ఫర్‌ ద డిఫెన్స్, రిలీజ్‌ ఆఫ్‌ జీఎన్‌ సాయిబాబా’ కన్వీనర్‌ ప్రొ.జి. హరగోపాల్‌ ఆరోపించారు.  

భీమా–కోరెగావ్‌ ఘటనలో ప్రమేయముందన్న ఆరోపణలపై నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ అధ్యాపకుడు, 90 శాతం వైకల్యంతో బాధపడుతున్న డాక్టర్‌.జి.ఎన్‌. సాయిబాబాకు అవసరమైన మందులు, పుస్తకాలు, ఉత్తరాలు వెంటనే అందజేయాలని జైలు అధికారులకు పౌరహక్కుల నేత, ప్రొ.జి. హరగోపాల్‌ విజ్ఞప్తి చేశారు. 

మందులు, లేఖలు, అధ్యయనానికి అవసరమైన మెటీరియల్‌ ఇవ్వడం వంటి ప్రతీ ఖైదీకి అందాల్సిన మౌలిక హక్కులను కల్పించాలనే డిమాండ్‌తో బుధవారం నుంచి నిరాహార దీక్షకు దిగనున్నట్లు సాయిబాబా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కోరుతున్న వాటిని అందజేయాలని మంగళవారం ఓ ప్రకటనలో ప్రొ.జి.హరగోపాల్‌ విన్నవించారు.

సాయిబాబా ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, కరోనా సోకే ప్రమాదమూ ఉన్నందున ఆయన్ను అనవసర ఆంక్షలతో వేధించవద్దని కోరారు. ఇప్పటికే కోవిడ్‌ కారణంగా సాయిబాబాను కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలు సుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. అందువల్ల ఆప్తులు, మిత్రుల లేఖలు అందజేయడంతో పాటు, ఆయన కోరిన పుస్తకాలూ ఇవ్వాలని పేర్కొ న్నారు. 

ఆ రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకున్నాయి.. టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే..!

న్యాయవాది ఇచ్చిన మందులు, పుస్తకాలు కూడా సాయిబాబాకు చేరనివ్వకపోవడం శోచనీయమన్నారు. గతంలో మాతృమూర్తి అంత్యక్రియలకూ అనుమతినివ్వకపోవడం, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పెరోల్‌మెడికల్‌ బెయిల్‌ ఇవ్వకపోవడంతో ప్రస్తుతం కరోనా కారణంగా ఆయన ప్రాణానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. 

ఈ విషయంపై ప్రజాస్వామ్య వాదులు, సంస్థలు స్పందించి నాగ్‌పూర్‌ జైలు అధికారులకు విజ్ఞప్తులు పంపడం ద్వారా సాయిబాబా హక్కులు కోల్పోకుండా చూడాలని కోరారు. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (జైళ్లు)కు ఈ నెల 15న సాయిబాబా భార్య వసంతకుమారి వినతిపత్రం పంపించారని హరగోపాల్‌ తెలిపారు. 

ఈ విషయంలో వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సాయిబాబా నిరాహార దీక్షకు దిగకుండా ఆయన అడిగినవి ఇవ్వాలని కోరారు.   

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా 2014 నుంచి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నాగ్‌పూర్ సెంట్లల్ జైలులో శిక్ష అనుభవిస్తుండటం తెలిసిందే. 90 శాతం వైకల్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తనకు ప్రాథమిక హక్కులను కూడా కల్పించకుండా అత్యవసరమైన మందులు, పుస్తకాలు, ఉత్తరాలు వంటివి అందించనందుకు నిరసనగా సాయిబాబ ఈ బుధవారం నుంచి జైల్లోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటడం తెలిసిందే.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle