newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ తప్పుకున్నట్లేనా..?

02-05-202102-05-2021 17:15:22 IST
Updated On 03-05-2021 07:26:56 ISTUpdated On 03-05-20212021-05-02T11:45:22.979Z02-05-2021 2021-05-02T11:45:18.361Z - 2021-05-03T01:56:56.253Z - 03-05-2021

ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ తప్పుకున్నట్లేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రశాంత్ కిషోర్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాడానికి ఈయన వ్యూహాలే అని చాలా మంది చెబుతూ ఉంటారు. అందులో నిజముందనుకోండి. ఇక ఈ ఏడాది బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎంతగానో కష్టపడ్డారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే విజయాలు దాదాపు ఖాయమయ్యాయి. ఆ రెండు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ వ్యవహరించారు. 

ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా ఎన్నికల ఫలితాల సరళి నేథ్యంలో వ్యూహకర్త పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక తాను చేస్తున్న దాన్ని కొనసాగించలేనని జాతీయ మీడియాతో చెప్పుకొచ్చారు. చేయగిలినంత చేశాను.. బెంగాల్‌ గెలిచింది.. ప్రస్తుతం కొంతకాలం బ్రేక్‌ తీసుకొని జీవితంలో ఇంకేమైనా చేయాలని భావిస్తున్నా అన్నారు. మళ్లీ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారా అని ప్రశ్నించినపుడు.. రాజకీయాల్లో తాను విఫలమయ్యానని.. ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగబోవడంలేదని స్పష్టం చేశారు.

బెంగాల్ గెలిచిందని, అందుకు తాను ఎంత చేయాలో అంతా చేశానని అన్నారు. కొంతకాలం విరామం తీసుకోవాలనుకుంటున్నానని వెల్లడించారు. బెంగాల్ లో 8 విడతల్లో ఎన్నికలు జరగ్గా బీజేపీకి రెండంకెల సీట్లు దాటితే తాను ట్విట్టర్ నుంచి తప్పుకుంటానని ప్రశాంత్ కిశోర్ గతంలో సవాల్ చేశారు. ఆయన సవాల్ కు తగ్గట్టుగానే బీజేపీకి ప్రస్తుతం బెంగాల్ ఓట్ల లెక్కింపులో రెండంకెలకు మించి సీట్లు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు.

మోదీ పాపులర్‌ వ్యక్తి అయినంత మాత్రానా బీజేపీ అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచి తీరాలన్న గ్యారంటీ ఏమీ లేదంటూ వ్యాఖ్యానించారు. టీఎంసీకి విజయం ఏకపక్షమే అయిన తీవ్ర పోటీ ఎదురైందన్నారు. ఎన్నికల కమిషన్ పక్షపాతంగా వ్యవహరించి, తమ ప్రచారాన్నిఅడ్డుకుందని, దీంతో చాలా కష్టపడాల్సి వచ్చిందని పీకే చెప్పారు. 

నందిగ్రామ్ లో సువేందు అధికారి మమతా బెనర్జీని ముచ్చెమటలు పట్టించారు.  విజయం మాత్రం మమతా బెనర్జీని వరించింది. నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్‌ కౌంటింగ్‌లో దీదీ విజయం సాధించారు. సువేందుపై 1200 ఓట్ల ఆధిక్యంతో మమత విజయం సాధించారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతానికి 214 సీట్లలో ఆధిక్యం కనబరుస్తూ ఉండగా.. బీజేపీ 77 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   4 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   12 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   13 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   a day ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle