newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క డోస్ చాలు..

11-06-202111-06-2021 16:29:01 IST
2021-06-11T10:59:01.701Z11-06-2021 2021-06-11T10:54:11.811Z - - 22-06-2021

కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క డోస్ చాలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క టీకా డోసు చాలని ఏఐజీ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. వైరస్ బారినపడిన నెల రోజుల తర్వాత ఒక డోసు పొందడం ద్వారా వీరిలో గణనీయంగా యాంటీ బాడీలు వృద్ది చెందినట్లుగా వైద్య నిపుణులు గుర్తించారు. ఈ అంశంపై హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్స్టిట్యుట్ అఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) వైద్య నిపుణులు డా. నాగేశ్వరరెడ్డి ఇతర డాక్టర్లు సంయుక్తంగా పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనలో భాగంగా కరోనా బారిన పడిన వారికి, కరోనా బారిన పడని వారికి టీకాలు ఇచ్చారు. ఒక డోసు టీకా ఇచ్చిన వారిలో 4 వారాల తర్వాత యాంటీబాడీలు వృద్ది చెందాయా..? లేదా అనేది తెలుసుకోవడానికి న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఎస్ 1, ఎస్ 2 అనే పరీక్ష చేస్తారు. ఈ ఫలితాలలో యాంటీబాడీల వాల్యూ 150 దాటితే రక్షణగా ఉంటుందని, అదే వైరస్ సోకి తగ్గాక వ్యాక్సిన్ తీసుకుంటే 450 కంటే ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

కోవిడ్ సోకినా ఎవరైనా నెల రోజుల తర్వాత టీకా తీసుకోవచ్చు. ఇటువంటి వారికి ఒక్క డోసు తోనే యాంటీబాడీలు బాగా వృద్ది చెందుతాయని, రెండోది అవసరం లేదని, మిగిలిన వాటిని ఇతరులు ఉపయోగించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల టీకాలపై ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ అధ్యయన అంశాలను భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) కి కూడా పంపించామని, కోవిడ్ వచ్చిన వారికి ఒక డోసు బూస్టర్ డోసును ఏడాది తర్వాత ఇవ్వొచ్చని ఈ అధ్యయనం తెలుపుతుందని, కోవిడ్ వచ్చిన వారికి ఒక డోసు టీకా సరిపోతుందనే అంశం పై కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో విధాన పరమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ పరిశోధన ఎంతో ఉపయోగ పడుతుందని ఏఐజి చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్రెడ్డి తెలిపారు.

బీజేపీ యేతర వేదిక సిద్దమవుతుంది, ఈ రోజు ప్రతిపక్ష పార్టీల సమావేశానికి శరద్ పవార్ పిలుపునిచ్చారు

బీజేపీ యేతర వేదిక సిద్దమవుతుంది, ఈ రోజు ప్రతిపక్ష పార్టీల సమావేశానికి శరద్ పవార్ పిలుపునిచ్చారు

   8 hours ago

భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కోవిద్-19 కేసులు.. 91 రోజుల్లో అతి తక్కువ కేసులు

భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కోవిద్-19 కేసులు.. 91 రోజుల్లో అతి తక్కువ కేసులు

   9 hours ago

మహారాష్ట్రలో కొత్త డెల్టా - ప్లస్ కోవిడ్ వేరియంట్ 21 కేసులు నమోదు: మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే

మహారాష్ట్రలో కొత్త డెల్టా - ప్లస్ కోవిడ్ వేరియంట్ 21 కేసులు నమోదు: మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే

   12 hours ago

ప్రధాని నరేంద్ర మోడీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం

ప్రధాని నరేంద్ర మోడీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం

   12 hours ago

ఈ రోజు ఉత్తర అర్ధగోళంలో పొడవైన రోజు, ఢిల్లీ 14 గంటల సుదీర్ఘ పగటిపూట అనుభవిస్తుంది

ఈ రోజు ఉత్తర అర్ధగోళంలో పొడవైన రోజు, ఢిల్లీ 14 గంటల సుదీర్ఘ పగటిపూట అనుభవిస్తుంది

   a day ago

 దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్ ఈ రోజు నుంచే.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీ

దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్ ఈ రోజు నుంచే.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీ

   21-06-2021

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021

   21-06-2021

కోవిడ్ ఉద్భవించినప్పుడు, ఏ దేశమూ సిద్ధం కాలేదు; యోగా సహాయపడింది: మోడీ

కోవిడ్ ఉద్భవించినప్పుడు, ఏ దేశమూ సిద్ధం కాలేదు; యోగా సహాయపడింది: మోడీ

   21-06-2021

జూన్ 23 నుండి భారతదేశం నుండి దుబాయ్ వెళ్లే విమానాలను ప్రారంభం

జూన్ 23 నుండి భారతదేశం నుండి దుబాయ్ వెళ్లే విమానాలను ప్రారంభం

   20-06-2021

కొత్తగా ఎన్నికైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని ప్రధాని మోదీ అభినందించారు

కొత్తగా ఎన్నికైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని ప్రధాని మోదీ అభినందించారు

   20-06-2021

ఇంకా

Newssting

 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle