newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

టెట్‌ వ్యాలిడిటీ శాశ్వతం.. ఎన్‌సీటీఈ నిర్ణయం

22-10-202022-10-2020 10:41:08 IST
2020-10-22T05:11:08.355Z22-10-2020 2020-10-22T05:10:57.447Z - - 02-12-2020

టెట్‌ వ్యాలిడిటీ శాశ్వతం.. ఎన్‌సీటీఈ నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) పాలక మండలి నిర్ణయించింది. ఇప్పటివరకు టెట్‌ వ్యాలిడిటీ ఏడేళ్లు మాత్రమే ఉంది. ఇకపై దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మార్చాలని నిర్ణయించింది. గత నెలలో జరిగిన ఎన్‌సీటీఈ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం ఇకపై టెట్‌లో అర్హత సాధించిన వారు మళ్లీ మళ్లీ టెట్‌ రాయాల్సిన పనిలేదు. 

ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్‌సీటీఈ భావిస్తోంది. 2010లో టెట్‌ను అమల్లోకి తెచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు ప్రతి 6 నెలలకోసారి టెట్‌ నిర్వహించగా, కొన్ని రాష్ట్రాలు రెండు మూడేళ్లకోసారి టెట్‌ నిర్వహించాయి. 

మొదట్లో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించిన లక్షల మందికి సంబంధించిన టెట్‌ వ్యాలిడిటీ ముగిసిపోయింది. అందుకే వారి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది. నీట్‌లో మెరిసిన తెలుగు తేజాలు..

కాగా, ఉమ్మడి ఏపీలో 4 సార్లు, తెలంగాణ వచ్చాక 2 సార్లు టెట్‌ నిర్వహించారు. మొదటిసారి టెట్‌ను 2011 జూలై 1న నిర్వహించగా, అందులో పేపర్‌–1లో 1,35,105 మంది, పేపర్‌–2లో 1,66,262 మంది అర్హత సాధించారు. రెండో టెట్‌లో పేపర్‌–1లో 24,578 మంది, పేపర్‌–2లో 1,94,849 మంది అర్హత సాధించారు. మూడో టెట్‌లో పేపర్‌–1లో 26,382 మంది, పేపర్‌–2లో 1,94,849 మంది అర్హత సాధించారు. అయితే అందులో టెట్‌ స్కోర్‌ పెంచుకునేందుకు రెండోసారి మూడోసారి రాసిన వారు కూడా ఉన్నారు. 

ఈ పరిస్థితుల్లో మొదటి మూడు టెట్‌లలో మొత్తంగా 7 లక్షల మందికి పైగా అర్హత సాధించగా, అందులో తెలంగాణ విద్యార్థులు 3 లక్షల మందికిపైగా ఉన్నారు. ఇప్పటికే వారందరి టెట్‌ వ్యాలిడిటీ ముగిసిపోయింది. వారి విషయంలో ఎన్‌సీటీఈ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. 

దేశంలో టీచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ప్రణాళికా బద్దంగా సమన్వయంతో అభివృద్ధి చేయాలని జాతీయ ఉపాధ్యాయ మండలి నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఉపాధ్యాయ బోధనా వ్యవస్థ ప్రమాణాలను మెరుగుపర్చి సమర్థవంతంగా నిర్వహించాలని నిర్ణయించుకుంది.  కేంద్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు రీసెర్చ్, శిక్షణతో సహా ప్రాథమిక, సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలన్నింటిలోనూ ఉపాధ్యయ విద్యను సమూలంగా మార్చివేయాలని కేంద్రం కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే.

ఆ రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకున్నాయి.. టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే..!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle