newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నందిగ్రామ్.. ఆధిక్యంలోకి ఎట్టకేలకు వచ్చిన మమతా బెనర్జీ

02-05-202102-05-2021 13:56:11 IST
2021-05-02T08:26:11.829Z02-05-2021 2021-05-02T08:26:08.535Z - - 14-05-2021

నందిగ్రామ్.. ఆధిక్యంలోకి ఎట్టకేలకు వచ్చిన మమతా బెనర్జీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకువెళుతున్నప్పటికీ.. మమతా బెనర్జీ లీడ్ లోకి వస్తుందా లేదా అన్నది ఆ పార్టీని కాస్త టెన్షన్ పెట్టింది. అయితే ఎట్టకేలకు మమతా బెనర్జీ ఆధిక్యం లోకి దూసుకు వచ్చింది. నాలుగు రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యంలో ఆమె  నందిగ్రాంలో  బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే 8,000 ఓట్ల వెనుకంజ‌లో ఉన్న విష‌యం తెలిసిందే. తర్వాతి రౌండ్ల‌లో ఆమె అనూహ్యంగా పుంజుకున్నారు. ఆరు రౌండ్ల ఓట్ల త‌ర్వాత ఆమె 1,427 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.  టీఎంసీ నుంచి కీలక నాయకులను తనపైపు తిప్పుకుని ఎలాగైనా దీదీని దెబ్బకొట్టాలని బీజేపీ ఎంతగానో ప్రయత్నించింది.  ఈ క్రమంలో మమతకు కీలకమైన నందీగ్రామ్‌నుంచే టీఎంసీ మాజీ మంత్రి సువేందు అధికారిని బీజేపీ తరపున బరిలో నిలిపి గట్టి సవాల్‌ విసిరింది. దీంతో తాను కూడా నందీగ్రామ్‌నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన దీదీ బీజేపీకి ప్రతిసవాల్‌ విసిరారు. మొదట లెక్కిస్తున్నప్పుడు సువేందు అధికారి లీడ్ లో ఉండగా.. ఇప్పుడు ఆ లీడ్ కాస్తా తగ్గుతూ వచ్చి.. మమతా ముందంజలో ఉన్నారు.  బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి, నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా  బీజేపీని గెలిపించేందుకు చాలా ప్రయత్నాలే చేశారు. అటు ఎన్నికల ర్యాలీలో గాయపడిన మమత కూడా ఏమాత్రం తగ్గకుండా వీల్‌చైర్‌లోనే ప్రచార పర్వాన్ని కొనసాగించి బెంగాల్‌  ఓటర్ల మనసు గెల్చుకునేందుకు ప్రయత్నించారు.

ప‌శ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్ సంపూర్ణ అధిక్యం అందుకుంటోంది. ఆ రాష్ట్రంలో ఏకంగా 201 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు గానూ ఎన్నిక‌లు జ‌రిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 147 స్థానాల్లో గెల‌వాల్సి ఉంది. అంతకంటే చాలా ఎక్కువ సీట్ల‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఇక బీజేపీ 85, వామ‌ప‌క్ష పార్టీలు 3, ఇత‌రులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. తృణ‌మూల్ కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాల్లో కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు డ్యాన్సులు చేస్తూ, బాణ‌సంచా పేల్చుతూ సంబ‌రాలు చేసుకుంటున్నారు.

 

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   2 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   10 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   11 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   21 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle