newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ ప్రమాణ స్వీకారం

08-05-202208-05-2022 20:40:34 IST
Updated On 08-05-2022 21:35:08 ISTUpdated On 08-05-20222022-05-08T15:10:34.128Z08-05-2022 2022-05-08T15:10:32.014Z - 2022-05-08T16:05:08.752Z - 08-05-2022

రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ ప్రమాణ స్వీకారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండవసారి  ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షులు తిరిగి  అరుదుగా ఎన్నికయ్యే  ఫ్రాన్స్  దేశంలో, మాక్రాన్ తన పాలనలో తీసుకున్న  వ్యాపార అనుకూల విధానాలు  మరియు పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదనకు ఆ దేశ ప్రజల్లో బలమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ, అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి అతివాద నాయకురాలు  చెందిన లి  పెన్‌పై 58.5 శాతం ఓట్లతో గెలవడం జరిగింది. 


Aravind


NewsSting Team
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle