ఉక్రెయిన్లో పర్యటించిన అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్
10-05-202210-05-2022 08:36:43 IST
2022-05-10T03:06:43.394Z10-05-2022 2022-05-10T03:06:36.914Z - - 10-08-2022

అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ ముందస్తు సమాచారం లేకుండానే పశ్చిమ ఉక్రెయిన్లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. స్లొవేకియాలోని చిట్టచివరి గ్రామం వద్ద సరిహద్దును దాటి 10 నిమిషాలపాటు వాహనంలో ప్రయాణించి ఉక్రెయిన్లోని ఉజ్హొరోత్ పట్టణానికి జిల్ బైడెన్ చేరుకున్నారు. అక్కడ రెండు గంటలపాటు ఆమె గడిపారు. ఉక్రెయిన్ ప్రథమ పౌరురాలు ఒలెనా జెలెన్స్కీతో సమావేశమయ్యారు. మాతృ దినోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న క్రూరమైన యుద్ధం తక్షణమే ఆగిపోవాలని జిల్ బైడెన్ ఆకాంక్షించారు. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా ప్రజలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూనే ఉంటారని ఆమె అన్నారు. అనంతరం జిల్ బైడెన్, ఒలెనా జెలెన్స్కీ ఓ పాఠశాలలో కలుసుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషించారు. యుద్ధం వల్ల తాము ఎదుర్కొంటున్న కష్టనష్టాలు వివరిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని జిల్ బైడెన్ ఓదార్చారు. యుద్ధ సమయంలో జిల్ రాక సాహసోపేతమైన చర్య అని ఒలెనా కొనియాడారు.

మరో కీలకమైన పదవిలో భారతీయ-అమెరికన్
11-05-2022

మార్క్సిజంపై నమ్మకాన్ని పెంపొందించండి
10-05-2022

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జాకెట్కి వేలంలో 90వేల డాలర్లు
10-05-2022

పాత నిబంధనను తెరపైకి తెచ్చిన సెర్బియా ..!
09-05-2022

దక్షిణ కొరియాలో పెరుగుతున్న కొత్త COVID-19 కేసులు
08-05-2022

రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ ప్రమాణ స్వీకారం
08-05-2022

OPEC క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర పెరిగింది ..!
06-05-2022

‘పద్మ’అవార్డుల కోసం ఆన్లైన్ నామినేషన్లకి ఆహ్వానం
06-05-2022

రక్షణ సహకారంపై దక్షిణ కొరియా, నార్వే ..!
02-05-2022

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ పర్యటన నేటినుంచే
02-05-2022
ఇంకా